Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డాక్టర్ శ్రీనివాస్ వర్మ
వర్మ ఆస్పత్రిలో రక్తదాన శిబిరం
నవతెలంగాణ-మట్టెవాడ
'అన్ని దానాల్లోకెల్లా రక్తదానం మిన్న' అని వర్మ ఫౌండేషన్ అధినేత డాక్టర్ శ్రీనివాస్ వర్మ అన్నారు. ఆదివారం చార్బౌలిలోని వర్మ ఆస్పత్రిలో ఎంజీఎం బ్లడ్ బ్యాంక్ హెచ్ఓడీ డాక్టర్ ప్రసాద్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రక్తదానంతో ఆపదలో ఉన్న వారినీ రక్షించవచ్చని తెలిపారు. ఈ శిబిరంలో 64మంది దాతలు రక్తదానం చేశారని పేర్కొన్నారు. రక్తదాతలకు దాతలకు ప్రోత్సాహకంగా తమ పౌండేషన్ ఆధ్వర్యంలో రెండు లక్షల ప్రమాద బీమా చేయించినట్టు తెలిపారు. ఎంజీఎం తరుపున బ్లడ్ బ్యాంకు ప్రోత్సాహ పత్రాలను అందించినట్టు పేర్కొన్నారు. ఈ సందర్భంగా రక్తదాతలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, ఈశ్వర్, రాజు, వెంకటేష్, సుభాష్, కష్ణవేణి, పాలకుర్తి స్రవంతి తదితరులు పాల్గొన్నారు.