Authorization
Mon Jan 19, 2015 06:51 pm
22వ డివిజన్ కార్పొరేటర్
బస్వరాజు కుమారస్వామి
నవతెలంగాణ-పోచమ్మ మైదాన్
డివిజన్ ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎల్లవేళలా అండగా నిలుస్తానని 22వ డివిజన్ కార్పొరేటర్ బస్వరాజు కుమారస్వామి తెలిపారు. ఆదివారం కొత్తవాడ కెమిస్ట్ భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో డివిజన్ ప్రజలు ఆయనను ఘనంగా సన్మా నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డివిజన్ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు. ప్రజలు ఏమైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని, తద్వారా సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు. తన విజయం ప్రజలకే అంకితమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అఖిలభారత పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ లయన్ ఆడెపు రవీందర్, కాంగ్రెస్ నాయకుడు చిప్ప వెంకటేశ్వర్లు, తౌటి శ్రీనివాస్, జన్ను యోసెప్ రాజ్, జన్ను సుధాకర్ రైల్వే, చిన్న సుధాకర్, ప్రమోద్, దయానంద్, డివిజన్వాసులు పాల్గొన్నారు.