Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హసన్‌పర్తి
సమాజ నిర్మాణంలో విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను బోధించడగం కీలకమని జిల్లా గవర్నర్ లయన్ ముచ్చా రాజిరెడ్డి అన్నారు. ఎర్రగట్టుగుట్ట గ్రీన్వుడ్ పాఠశాలలో అంతర్జాతీయ లయన్స్ సంస్థ ఆధ్వర్యంలో లయన్స్ క్వెస్ట్ (విలువలతో కూడిన విద్య) ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా క్వెస్ట్ కో-ఆర్డినేటర్ లయన్ దడిగల రమేష్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అంతర్జాతీయ క్వెస్ట్ ట్రైనర్ కొండపల్లి రేణుక అధ్యాపకులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు దురలవాట్లకు లోనుకాకుండా, ఈ విద్య ద్వారా వారిలో మార్పు కలుగుతుందన్నారు. ఉపాద్యాయులు వారధి లాంటి వారని, ఈ సంవత్సరం పదివేల మందికి ఈ విద్యను అందిస్తామని తెలిపారు. అనంతరం స్కూల్ డైరెక్టర్ గిర్రం భరద్వాజ నాయుడు మాట్లాడుతూ.. లయన్స్ క్లబ్ వారు గ్రీన్వుడ్ పాఠశాలను ఎన్నుకొని ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. విద్యార్థులను ఈ విద్య ద్వారా ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుతామని తెలిపారు. లయన్స్ క్లబ్ ఆఫ్ హసన్‌పర్తి వారు ఉపాద్యాయులకు జ్ణాపికలను అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మొదటి ఉప గవర్నర్ కన్నా పరశురాములు, రెండవ ఉప జిల్లా గవర్నర్ వెంకటేశ్వరరావు, అడిషనల్ జిల్లా కార్యదర్శి క్వెస్ట్ లయన్ డాక్టర్ అజిత్‌కుమార్, అడిషనల్ జిల్లా కార్యదర్శి సేవలు కుందూరు వెంకట్ రెడ్డి, జోన్ ఛైర్మన్ చెన్నూరి శ్రీనివాస్ పాల్గొన్నారు.