Authorization
Mon Jan 19, 2015 06:51 pm
5న నిర్వహించే మహాసభను జయప్రదం చేయండి
జీఎంపీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బొల్లం అశోక్..
నవతెలంగాణ-నర్సంపేట
గొల్ల కురుమలు తమ హక్కులను సాధన కోసం ఉద్యమించాలని జీఎంపీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి బొల్లం అశోక్ కోరారు. ఆదివారం మగ్దుంపురంలో నిర్వహించిన గొల్ల కురుమల సంఘం సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం గొల్ల కుర్మలకు రెండో విడత గొర్రెల పంపిణీ చేస్తామని చెప్పి మోసగించిందన్నారు. పలు గ్రామల్లో మొదటి విడుత గొర్రెల పంపిణీ మాత్రం చేసి వాటి మేత, మందులు, వైద్యం అందించడంలో ప్రభుత్వం చేతులెత్తేసిందన్నారు.
పశుసంవర్థక శాఖలో పోస్టులను భర్తీ చేయాలన్నారు. ప్రతి గ్రామంలో పశు వైద్య శాలలను నిర్మించి జీవాలకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. గొల్లకుర్మల హక్కులను సాధించుకోవడానికి ఐక్య పోరాటాలు చేపట్టాలన్నారు. ఈ మేరకు గంగదేవిపల్లిలో ఈ నెల 5న నిర్వహించనున్న గొల్ల కురుమల ర్యాలీ, జిల్లా మహాసభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పరిగి మధుకర్, జిల్లా కమిటీ సభ్యులు కుండె లింగస్వామి, సోషల్ మీడియా మండల కన్వీనర్ కుండె రాజ్ కుమార్, పైడిపల్లి కొమురయ్య, దాడి రాజు, బండారి రాజు, ఆవుల ఓదేలు, ఎగ్గడి అనిల్, కొమ్మ కట్టయ్య, రాజు, చంద్రమౌళి రాజన్న, కొమ్మ లింగన్న, పైడిపల్లి ఐలయ్య, కుమారస్వామి, కొమురయ్య, అమ్మ రామచంద్రు, కొమ్మ అభరు, కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.