Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి యార ప్రశాంత్
నవతెలంగాణ-నర్సంపేట
విద్యా రంగ సమస్యలను పరిష్కారంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి యార ప్రశాంత్ అన్నారు. ఆదివారం ఖానాపురం మండల కేంద్రంలో జిల్లా కమిటీ సభ్యుడు మీడిద ప్రకాష్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వాలు విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ ప్రయివేటు కార్పోరేట్ రంగాలకు దారధత్తం చేశాయన్నారు. బీజేపీ ప్రభుత్వం విద్య కాషాయీకరణ, కార్పొరేటీకరణ చేస్తోందన్నారు. నూతన విద్యా విధానంతో జ్యోతిష్యాన్ని సెలబస్‌గా తీసుకొచ్చి విద్యార్థులను మూఢత్వంలోకి నెట్టేసే కుట్రలు చేస్తుందని విమర్శించారు. మరో వైపు ప్రభుత్వ రంగాలైన రైల్వేలు, ఎల్ఐసీ, విమానరంగం, బ్యాంకులు, బొగ్గు గనులు ఆస్తులను అమ్మేస్తూ కార్పొరేట్ రంగాలకు కొమ్ముకాస్తోందని దుయ్యపట్టారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఖాళీలను భర్తీ చేయకండా నిరుద్యోగ యువత బ్రతుకుల్లో మన్నుకొడుతోందని మండిపడ్డారు. యూనివర్సిటీలలో వీసీలను నియమించే స్థితిలో లేకపోవడం సిగ్గుచేటన్నారు. రూ.3,850 కోట్ల పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలన్నారు. విద్యార్థి వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్న ప్రభుత్వాలకు పోరాటాల ద్వారా గుణపాఠం చెప్పాలని, అందుకు ఎస్ఎఫ్ఐ చేపట్ట్టబోయే ఆందోళన పోరాటాలలో పాలుపంచుకోవాలని కోరారు. ఈ సమావేశంలో నాయకులు శివరాత్రి అనిల్, పిన్నింటి కార్తీక్, విజరు, ఎర్ర వంశీ, శ్రీకాంత్, సుమన్, కష్ణ, ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.