Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విజేతలకు బహుమతుల ప్రదానం
నవతెలంగాణ-హన్మకొండ
సైకిల్ ప్రయాణంతో ఆహ్లాదం, ఆరోగ్యం చేకూరుతాయని వరంగల్ పోలీసు కమిషనర్ డా||తరుణ్ జోషి అన్నారు. బుధవారం న్యూసైన్స్ పీజీ కళాశాల సెమినార్ హాల్లో ట్రైసిటీ రైడర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సైక్లింగ్ ఛాలెంజ్ విజేతలకు ఆయన మెడల్స్, మెమోంటోస్, సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు. అనంతరం మాట్లాడుతూ.. నగరంలో సైక్లింగ్‌ను ప్రమోట్ చేయడంలో ముందుండాలన్నారు. సైకిల్ ప్రయాణంతో అనేక ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. ఈ ప్రయాణంతో ఆరోగ్య రక్షణతో పాటుగా కాలుష్యాన్ని నివారించవచ్చాన్నారు. ట్రైసిటీ రైడర్స్ వరంగల్ వారి కార్యక్రమాలు నగరంలోని ప్రజలకు సైక్లింగ్‌పై అవగాహన కల్పించడంలో సాయపడుతున్నాయన్నారు. వీరి స్ఫూర్తితో వరంగల్ నగరాన్ని బైస్కిల్-ఫ్రెండ్లీ నగరాల్లో ఒకటిగా నిలిచేందుకు కృషి చేయాలన్నారు. ట్రైసిటీ రైడర్స్ వరంగల్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. సెప్టెంబర్‌లో వర్చ్యువల్‌గా 500కి.మీ సైక్లింగ్ ఛాలెంజ్‌లో కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, హర్యానా రాష్ట్రాలతో పాటుగా దుబారు దేశం నుండి మొత్తం 138మంది పాల్గొన్నట్టు తెలిపారు. అందులో 58 మంది టార్గెట్‌ను పూర్తిచేయగా, అందులో వరంగల్ వారే 20మంది ఉన్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల హైదరాబాద్ నుంచి కన్యాకుమారి, అక్కడి నుంచి గోవా, లడఖ్ వరకు వెళ్లి తిరిగి వరంగల్ చేరుకున్న రంజిత్ కుమార్‌కు సన్మానం చేశారు. ఈ కర్యాక్రమంలో ట్రైసిటీ రైడర్స్ బాద్యులు రాజా నరేందర్ రెడ్డి, కే విష్ణు వర్మ, పిండి ప్రదీప్ కుమార్, మంజూర్ సయెద్ , అనుదీప్ సిరిమిళ్ల, రాజేష్ కుమార్, శ్యామల, విశాల్, కత్తి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.