Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
భద్రకాళి నవరాత్రి ఉత్సవాలను నేటి నుండి 16 వరకు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్టు ఉమ్మడి జిల్లాల దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, భద్రకాళీ దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సునీత, ఆలయ ప్రధాన అర్చకులు భద్రకాళి శేషు తెలిపారు. బుధవారం ఆలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉత్సవాలకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ.. ఇబ్బందులు తలెత్తకుండా, సందర్శకులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. దేవస్థానానికి అన్ని వైపులా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. తొక్కిసలాట జరగకుండా సందర్శకుల కోసం క్యూ లైన్లు ఏర్పాటు చేశామని, అందరూ వీక్షించే విధంగా ఎలక్ట్రానిక్ తెరలను ఏర్పాటు చేసినట్లుగా పేర్కొన్నారు. ఈ మహౌత్సవాలు ఈ నెల 16 వరకు నిర్వహించనున్నట్టు, భక్తులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ సందర్శించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయం పూజారులు నాగరాజు, రాము రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఐనవోలు : నేటి నుంచి 15వ తేది వరకూ ఐనవోలు శ్రీ మల్లిఖార్జున స్వామి దేవస్థానంలోని శ్రీ భ్రమరాంబిక దేవి ఆలమంలో శరన్నవరాత్రోత్సవాలను నిర్వహించనున్నట్టు చైర్మన్ ముగాల సంపత్‌కుమార్, ఈఓ నాగేశ్వరావులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.