Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అహల్య
నవతెలంగాణ-జనగామ
భార్య గొంతు కోసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నవీన్‌ను కఠినంగా శిక్షించాలని ఐద్వా సంఘం ఉపాధ్యక్షురాలు ఇ అహల్య డిమాండ్ చేశారు. జిల్లాలోని తరిగొప్పుల మండలం సోలిపురం గ్రామానికి చెందిన దండెం జ్యోతి తన పిల్లలతో నిద్రిస్తున్న సమయంలో భర్త దండెం నవీన్ దాడి చేసి గొంతు కోసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా జనగామ స్థానిక ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆమెను ప్రజాసంఘాల నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా అహల్య మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరుగుతున్నాయని అనానరు. మహిళలకు రక్షణ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని , నవీన్‌ను పోలీసులు కస్టడీలోకి తీసుకోవాలన్నారు. భవిష్యత్‌లో ఇలాంటి దాడులు దౌర్జన్యాలు జరగ కుండా చట్టాలు పకడ్బందీగా అమలు చేయాలని, మహిళలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. హత్యాయత్నంకు ప్రోత్సహించిన నవీన్ కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమం లో ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి ఉరుసు మహేశ్వరి, జిల్లా నాయకురాలు పందిళ్ళ కళ్యాణి, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి బొట్ల శేఖర్, సీఐటీయూ జిల్లా కోశాధికారి జోగు ప్రకాష్, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షులు అజ్మీర సురేష్‌నాయక్, తదితరులు పాల్గొన్నారు.