Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ
జనగామ జిల్లా కేంద్రంలో ఈనెల 20, 21 తేదీల్లో నిర్వహించే ఎస్ఎఫ్ఐ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా కార్యదర్శి నరేందర్ పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక జిల్లా కార్యాల యంలో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడి ఏడేండ్లు గడిచినా విద్యారంగంలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉందని అన్నారు. రాష్ట్ర కమిటీ సమావేశాలకు ఎస్ఎఫ్ఐ ఆలిండియా అధ్యక్షుడు విపి సాను పాల్గొన నున్నట్టు తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే రాష్ట్ర కమిటీ సమావే శాలకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతినిధులు హాజరవుతారని, భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కరిం చకుంటే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చ రించారు. పెండింగ్లో ఉన్న 3850 కోట్ల పెండింగ్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేసి విద్యార్థులను ఆదుకోవాలని అన్నారు. పేద మధ్య తరగతి కుటుంబాల విద్యార్థుల స్కాలర్షిప్స్ సకాలంలో ఇవ్వకపోవడంతో మధ్యలోనే చదువు ఆపేస్తున్న పరిస్థితి నెలకొంటోందన్నారు. రేషనలైజేషన్ పేరుతో విద్యాసంస్థల మూసివేత సరైన పద్ధతి కాదని అన్నారు. ఇప్పటికైనా ఇలాంటి ఆలోచన విరమింప చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ధర్మభిక్షం, జిల్లా ఉపాధ్యక్షుడు దడిగే సందీప్, నాయకులు కనకాచారి, గణేష్, రమేష్ పాల్గొన్నారు.