Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకుర్తి
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న నిరసన ర్యాలీలో రైతులపై కారుతో దూసుకెళ్లిన కేంద్రమంత్రి కుమారుడి దాష్టీకత్వానికి కేంద్రమంత్రి అజరు మిశ్రాని మంత్రి పదవి నుంచి భర్తరఫ్ చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మాచర్ల సారయ్య డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ నిరసన కార్యక్రమం చేసిన రైతులపై కాన్వారు ఎక్కించి అన్నదాతల్ని చంపిన మంత్రి అజరు మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రా, బీజేపీ నేతలపై హత్య కేసు నమోదు చేయాలని అన్నారు. పది నెలలుగా కొనసాగుతున్న రైతు పోరాటాలపై కేంద్ర ప్రభుత్వం విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తూ హింసను ప్రేరేపించిన నేపథ్యంలో రైతుల హత్యలు సంభవించాయని తెలిపారు. ఘటనకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని, మతి చెందిన కుటుంబాలను, గాయపడిన కుటుంబాలను అన్ని విధాల ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన మహత్తర రైతాంగ ఉద్యమంలో 600 మంది రైతులు ప్రాణాలర్పించారని, వారి త్యాగాలు వధా కావని పేర్కొన్నారు. రైతు వ్యతిరేక చట్టాలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని, పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, కేంద్ర ప్రభుత్వ ఫాసిస్ట్ చర్యలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వాలు రైతాంగ ఉద్యమానికి అండగా నిలవాలని అన్నారు.