Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శాయంపేట
మండల పరిధిలోని గ్రామాల్లో బుధవారం ఎంగిలిపూల బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. మహిళలు తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలతో ఆయా గ్రామాలలోని దేవాలయాలలో పాటలు పాడుతూ ఆటలు ఆడారు. అనంతరం ఒకరికొకరు వాయినం ఇచ్చుకున్నారు. పోలీసులు ముందస్త్ను జాగ్రత్త చర్యలు చేపట్టారు.
నవతెలంగాణ-సంగెం
ఎంగిలి పూల బతుకమ్మను ఎంపీపీ కందకట్ల కళావతి ఆమె నివాసంలో బుధవారం పేర్చారు. గౌరమ్మకు పూజలు చేసి, భాగం వక్కల ఫలహారంతో ఊరిబయట దేవాలయంలో తోటి మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.
నవతెలంగాణ-హసన్పర్తి
మండలంలో ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఆయా గ్రామాలలో ఆలయ ప్రాంగణాలు ఆడపడుచుల సంబురాలతో కిటకిటలాడాయి. మహిళలు బతుకమ్మ ఆడే ప్రాంతాలలో హైమాస్ లైట్లను ఏర్పాటు చేసారు. ఆకతాయిల నుంచి మహిళలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా బ్లూకోల్ట్స్ సిబ్బంది, పోలీసు సిబ్బంది పెట్రోలింగ్ నిర్వహించారు. జయగిరిలో జెడ్పీటీసీ రేణికుంట్ల సునితప్రసాద్, మల్లారెడ్డిపల్లిలో కేతపాక సునితరాజు, ఆయా గ్రామాలలో సర్పంచ్లు బండ అమితాజీవన్రెడ్డి, పెద్ది తిరుపతమ్మమల్లారెడ్డి, చిర్ర సుమలతవిజరుకుమార్, జోరుక పూల, బొల్లవేన రాణిరాజు, శాంతిభగత్, నూనావత్ ఐలమ్మమొగిళి, ఎంపీటీసీలు జట్టి మంజుల, గౌరు సుమతి, బండారి రజిత, పల్లె విజయచంద్రకుమార్, కొయ్యడ దీపికలు మహిళలతో కలిసి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు.
నవతెలంగాణ కాజీపేట.
సంస్కతీ, ఆచార సంప్రదాయాలను భావితరాలకు అందించాలని సీనియర్ ఉపాధ్యాయురాలు జి.వాణిశ్రీ కోరారు. రెడ్డికాలనీ ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాల ప్రాంగణంలో బతుకమ్మ సంబురాలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేటి ఆధునిక యుగంలో సంస్కతీ పరిరక్షణ కోసం వేడుకలు ఉపయోగప డతాయన్నారు కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎమ్డీ అజార్ హుస్సేన్, శమంతకమణి, ఎస్ఎంసీ చైర్మన్ గౌసీయోద్దీన్, డాక్టర్ పావుశెట్టి శ్రీదర్, స్టాఫ్ సెక్రటరీ పెరుమాండ్ల సాంబమూర్తి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-వేలేరు
మండలంలో బుధవారం ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. వేలేరులో మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కే మాధవరెడ్డి, వివిద గ్రామాలలో సర్పంచుల అధ్వర్యంలో గ్రామపంచాయతీల పాలక వర్గాలు మహిళలు ఆడుకునే విధంగా విద్యుత్ దీపాలు అమర్చారు . వేలేరు ఎస్సై నీలోజు వెంకటేశ్వర్ల అధ్వర్యంలో పొలీసులు మాస్కులు ధరించని మహిళలకు మాస్కులు పంపిణీ చేసారు.
నవతెలంగాణ- ఆత్మకూరు
మండలంలోని వివిధ గ్రామాల్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు కొలాటం ఆడుతూ, పాటలు పాడుతూ ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు.
నవతెలంగాణ-నడికూడ
మండలంలోని బుధవారం ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి రంగురంగుల చీరలతో ముస్తాబై వాడ వాడ ఆడపడుచులు ఒక చోట చేరి ఉత్సాహంగా వేడుకలను నిర్వహించుకున్నారు.
నవతెలంగాణ-నెక్కొండ రూరల్
మండలంలో బతుకమ్మ వేడుకలు ఉత్సాహంగా బుధవారం మొదలయ్యాయి. నెక్కొండలో బొడ్రాయి వద్ద బతుకమ్మ వేడుకలకు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సర్పంచ్ యమునరంజిత్రెడ్డి లైటింగ్, ఇతర ఏర్పాట్లు చేశారు. అలాగే మండలంలోని రెడ్లవాడ, అలంఖానిపేట, సాయిరెడ్డిపల్లె, దీక్షకుంట, పెద్దకొర్పోలు, తోపనపల్లి, వెంకటాపురం, అప్పల్ రావుపేట, ముదిగొండ, పత్తిపాక, నాగారం, చిన్న కొర్పోలు, గొల్లపల్లి, ముదిగొండ, పనికర, అమీన్పేట, సూరిపల్లి, బొల్లికొండ, చంద్రుగొండగుండ్రపల్లి గ్రామాల్లో బతుకమ్మ వేడుకలకు సర్పంచ్లు లైటింగ్, ఇతర సదుపాయాలను ఏర్పాట్లు చేశారు.
నవతెలంగాణ-గోవిందరావుపేట
మండల వ్యాప్తంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను బుధవారం మహిళలు ఘనంగా నిర్వ హించుకున్నారు. మండలంలో ప్రజా ప్రతినిధలు, అధి కారులు వేడుకల నేపథ్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు.
నవతెలంగాణ-పర్వతగిరి
తెలంగాణ సంస్కతి, సంప్రదాయాలకు ప్రతీకగా బతుకమ్మ పండుగ చరిత్రలో నిలుస్తోందని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. మండలంలోని తురుకల సోమారం, రోళ్లకల్ గ్రామాల్లో బుధవారం బతుకమ్మ తల్లి విగ్రహాలను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. దేశంలో ఎక్కడా లేని విధంగా పూలను పూజించే సంప్రదాయం కేవలం మన రాష్ట్రంలోనే ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు రాపాక రేణుక, సాధ్యా నాయక్, ఎంపీపీ లునావత్ కమల, టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
తాడ్వాయి : మండలంలో బుధవారం ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను మహిళలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
నవతెలంగాణ-హనుమకొండ
బుధవారం అశోక్ కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు స్థానిక కార్పొరేటర్ నల్లా స్వరూప రాణి ముఖ్యఅతిథిగా హాజరై మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో అశోక్ కాలనీ అభివద్ధి కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస రావు, కార్యదర్శి కృష్ణారెడ్డి, మహిళలు తదితరులు పాల్గొన్నారు.