Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లయన్ డిస్ట్రిక్ట్ గవర్నర్ రాజిరెడ్డి
నవ తెలంగాణ తొర్రూరు
సమాజ అభివద్ధిలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని లైన్స్ క్లబ్ ఆఫ్ 320ఎఫ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ముచ్చ రాజి రెడ్డి అన్నారు. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా స్థానిక లయన్స్ భవన్ లో బుధవారం ఉపాధ్యాయులను, స్కూల్ అసిస్టెంట్, సెకండ్ గ్రేడ్ టీచర్స్ విభాగంలో 14 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేసి శాలువ, మెమెంటో తో సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ తొర్రూరు లైన్స్ క్లబ్ సేవలు మరువలేనివి అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం లైన్ సేవలు విస్తరించడం, నాలుగు మంది ఉపాధ్యా యులను సన్మానించడం అభినందనీయమన్నారు. తొర్రూరు లైన్స్ క్లబ్ కు బాడీ ఫ్రీజర్ ను ఉచితంగా అందజేస్తామన్నారు. మల్టిపుల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ లక్ష్మీ నరసింహారావు, మాజీ డిస్టిక్ గవర్నర్ డాక్టర్ కుందూరు రాజేందర్‌రెడ్డి, చిట్టి కోఆర్డినేటర్ మహంకాళి బుచ్చయ్య, జిల్లా సభ్యులు శ్రీనివాస్, రాము, గోపాల్ రెడ్డి, జోన్ చైర్మన్ దేవేందర్ రెడ్డి, రీజినల్ చైర్ పర్సన్ డాక్టర్ వి. శారద, చార్టర్ ప్రెసిడెంట్ ఉపేందర్ రెడ్డి, నరసింహారెడ్డి, తండా ప్రభాకర్, చింతల సురేష్, సతీష్ రెడ్డి, కొల్లూరు అశోక్, వెంకటేశ్వర్లు, వీరన్న, యాకయ్య, కిషన్‌నాయక్, బుచ్చి రామయ్య తదితరులు పాల్గొన్నారు.