Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గూడూరు యూనియన్ బ్యాంక్ మేనేజర్ డి బన్సీలాల్
నవతెలంగాణ-గూడూరు
యూనియన్ బ్యాంక్ ఖాతాదారులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జెన్ సురక్ష పథకం ద్వారా ఇన్సూరెన్స్ తీసుకోవాలని గూడూరు యూనియన్ బ్యాంక్ మేనేజర్ డీ బన్సీలాల్ కోరారు. బుధవారం గూడూరు యూనియన్ బ్యాంకులో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన 18 -50 ఏండ్లలోపు కలిగిన వారు రూ.330 చెల్లించాల్సి ఉంటున్నారు. ఇన్సూరెన్స్ తో ఎలాంటి సాధారణ మరణం అయినా రెండు లక్షల వరకు బీమా వర్తిస్తుంది అని తెలిపారు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పొందాలంటే 18-70ఏండ్లఓపు వారు రూ.12 చెల్లించి నట్లైతే యాక్సిడెంటల్ మరణానికి ఇన్సూరెన్స్ వర్తిస్తుందని తెలిపారు. అటల్ పెన్షన్ యోజన ద్వారా 40- 60 సంవత్సరాల వారు సమర్థతను బట్టి బ్యాంకులో సేవింగ్ చేస్తే పింఛన్ రూపంలో డబ్బులు అందిస్తారని పేర్కొ న్నారు. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం కూడా అమలులో ఉందని పేర్కొన్నారు. ఇన్సూరెన్స్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.