Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి టౌన్
రాజుల సొమ్ము రాళ్ళ పాలు అన్నట్లుంది. గ్రామగ్రామాన ఆర్టీసి బస్సు షెల్టర్లు నిర్మించి ప్రభుత్వం ప్రయాణికులకు సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడవి అలంకార ప్రాయంగా పిచ్చిమొక్కలు మొలిచి నిరుపయోగంగా కూలడానికి సిద్దంగా ఉన్నాయి. ఊరూరా ఆటోలు పుట్టుకొచ్చాయి. నిరుద్యోగులు ఆటోలు ఫైనాన్స్ తీసుకొని ప్రతి గ్రామంలో ప్రయానికులు ఉన్నచోటుకే వెల్లి రవాణా చేయడంతో ఆర్టీసీ బస్సు ఎక్కేవారు లేక పల్లె వెలుగు బస్సు లు చీకటిమయములో పడిపోయాయి. బస్ ఆగే చోట బస్ షెల్టర్లు నిర్మించక వేరేచోట కట్టడం, ఏ ఊరికెల్లినా బోసిపోయిన బస్ షెల్టర్లు జీవాలకు నిలయాలయ్యాయి. ప్రజలు ఊరికి బస్ రానప్పుడు ఆటోలకే పరిమితం అవుతున్నారు ప్రస్తుతం అడిగినంత ఇవ్వాల్సి వస్తుందని వాపోతున్నారు.