Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాటారంలో తరచూ ప్రమాదాలు, పట్టించుకోని ట్రాన్స్‌కో అధికారులు
నవతెలంగాణ-కాటారం
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం గ్రామపంచాయతీలో వీధి దీపాలు పెడుతున్న సమయంలో కరెంట్ షాక్ కు గురై దుర్గం సురేష్ అనే ప్రైవేట్ కూలి తీవ్ర గాయాల పాలయ్యాడు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం తొర్రి చెరువుగంగారం గ్రామానికి చెందిన దుర్గం సురేష్‌కు ఈ సంఘటనలో తీవ్రగాయాలయ్యాయి. దుర్గం సురేష్ అదే గ్రామానికి చెందిన మిత్రులతో కలిసి కాటారం గ్రామ పంచాయతీలో వీధిలైట్లు బిగించడానికి వచ్చినట్లు తెలిసింది. అందులో భాగంగా మంగళవారం కాటారం గ్రామ పంచాయతీలోని అయ్యప్ప టెంపుల్ సమీపంలో స్తంభాలకు వీధి లైట్లు పెడుతుండగా కరెంట్ షాక్ కు గురై సురేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం మహాదేవపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాటారం సర్పంచి తోట రాధమ్మ ,కాటారం ఎంపీటీసీ తోట జనార్ధన్ ఆదేశాల మేరకు గ్రామంలో వీధి దీపాలు పెట్టేందుకు గ్రామ పంచాయతీ సిబ్బంది, వార్డు సభ్యులు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు గారెపల్లి ఫీడర్ కు ఎల్ సి తీసుకొన్నారు. గారేపెళ్లిలో పురవీధులలో లైట్లు బిగించిన అనంతరం గారెపెళ్లి ఊర పోచమ్మ పరిసర ప్రాంతంలో గల స్తంభాలకు వీధిలైట్లు బిగిస్తున్నారు. ఈ సమయంలో అకస్మాత్తుగా కరెంట్ షాక్‌కు గురై సురేష్ వైర్ల పైనే పడి ఉన్నాడు. సురేష్ తో ఉన్న వ్యక్తులు ట్రాన్స్‌కో అధికారుల సమాచారం అందించగా ఫీడర్ ఆఫ్ చేయడంతో సురేష్ ప్రాణాప్రాయం నుండి బయటపడ్డాడు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం మూలంగా పోచమ్మ వీధికి చింతకాని ఫీడర్ కరెంట్ సప్లై చేయడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలిసింది .విద్యుత్ శాఖ అధికారులతో ఎల్ సి తీసుకొని పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పనులు చేయడానికి తీసుకున్నారు. కానీ మధ్యాహ్నం 3 గంటల వరకు పనులు కొనసాగిస్తున్న సమయంలో విద్యుత్ శాఖ గురైన సురేష్ కు తీవ్ర గాయాలయ్యాయి. గారేపెళ్లి ఊర పోచమ్మ చెరువు ప్రాంతంలో గల విద్యుత్ లైన్‌కు చింతకాని ఫీడర్ నుండి విద్యుత్ కనెక్షన్ ఇవ్వడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గురైన సురేష్ణఉ జెసిబి సహాయంతో కిందికి దించారు. విద్యుత్ అధికారుల తప్పిదం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టు కాటారం సర్పంచ్ తోట రాధమ్మ ఎంపీటీసీ తోట జనార్ధన్ తెలిపారు. కాటారం ఏఈ ఆంజనేయులు విధుల పట్ల నిర్లక్ష్యం వహించడం వల్లే ప్రమాదం జరిగినట్లు స్థానికులు ఆరోపించారు.
విద్యుద్ఘాతంతో ఒకరు మతి
ఎంగిలిపూల బతుకమ్మ పండుగ రోజు భూపాలపల్లి పట్టణ కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ తో ఒకరు మతి చెందారు. పూర్తి వివరాల్లోకి వెళితే భూపాలపల్లి సంతోషిమాత ఆలయం ఎదురుగా గల సర్వీసింగ్ సెంటర్ లో వాహనా సర్వీసింగ్ చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు సర్వీసింగ్ నిర్వాహకులు అజ్మీర భరత్25 విద్యుత్ షాక్ షాక్ తో మతి చెందాడు. గమనించిన కుటుంబ సభ్యులు స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో మతదేహాన్ని ఏరియా ఆసుపత్రికి తరలించారు. మతుడు భరత్ భూపాలపల్లి మండలం దీక్ష కుంట గ్రామానికి చెందిన వాడని, మతుడికి ఈ మధ్యకాలంలో వివాహం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఇంకా ఫిర్యాదు అందలేదని అందిన వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు