Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ
ఆరుగురు రైతులను కర్కశంగా హత్యచేసిన కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి కుమారుడు ఆశీస్ ను ఉరి తీయాలని డిమాండ్ చేస్తూ బుధవారం జనగామ జిల్లా కేంద్రంలో నెహ్రూ పార్క్ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి అజరు మిశ్రా దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఐరాష్ట్ర సమితి సభ్యులు ఆది సాయన్న, జిల్లా కార్యవర్గ సభ్యులు మంగళంపల్లి జనార్ధన్‌లు మాట్లాడుతూ ఢిల్లీలోబీజేపీ ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తెచ్చిన మూడు చట్టాలను రద్దు చేయాలని అన్నారు. ఆందోళన చేసి తిరిగి వెళుతున్న రైతులపై కేంద్ర హౌం శాఖ సహాయ మంత్రి అజరు మిశ్రా కుమారుడు కక్షతో, కారుతో వారిపైకి దూసుకెళ్లి ఆరుగురు రైతులను హత్య చేఆడని అన్నారు. ఆశీస్‌ను బహిరంగంగా ఉరి తీయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ బిజెపి ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. అలాగే మంత్రిఅజరు మిశ్రా వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి సొప్పరి సోమయ్య, శ్రీశైలం, నాగరాజు, అమాలి యూనియన్ కార్యదర్శి చామకూర యాకుబ్, నాగేష్, యాదగిరి, అక్షరు కుమార్ పాల్గొన్నారు.