Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గార్ల
మండల పరిధి మర్రిగూడెం పంచాయితీలో పూర్తైన డబుల్ బెడ్ రూం ఇండ్లకు గత మూడు నెలల క్రితం లబ్ధిదారులను డ్రా పద్ధతి లో ఎంపిక చేసినప్పటికీ ఇండ్లు కేటాయించ లేదని లబ్ధిదారులు ఆరోపించారు. మర్రిగూడెం గూడెం గ్రామంలో ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్ల ను లబ్ధిదారులకు కేటాయించాలని డ్రాలో పేర్లు వచ్చిన లబ్ధిదారులు స్దానిక డబుల్ బెడ్ రూం ఇండ్ల ఎదుట బుధవారం అందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు మాట్లాడుతూ... మూడు నెలల క్రితం డ్రా నిర్వహించి ఇప్పటి వరకు లబ్ధిదారులకు ఇండుల అందించలేదని అందోళన వెలిబుచ్చారు. దీంతో ఇండ్లు లేని పేద గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. స్థానికులు కొందరు కావాలనే డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. సంబంధిత రెవెన్యూ అధికారులు స్పందించి లబ్ధిదారులకు ఇండ్లు అందజేయాలని కోరారు. ఈ విషయమై తహసీల్ధార్ స్వాతి బిందును చర వాణిలో సంప్రదించగా అందుబాటులోకి రాకపోడం గమనార్హం.