Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గార్ల
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రైతులపై జరిగిన దాడిని ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఖండించాలని, దాడిలో ముగ్గురు రైతులను కారు తో ఢ కొట్టించి వారి పై దాడులు చేసి రైతుల మరణానికి కారణమైన కేంద్ర మంత్రి కుమారుడు అశీష్ మిశ్రా పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీపీఐ మండల సహాయ కార్యదర్శి రాగం రమేష్ డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్ లో మరణించిన రైతుల కుటుంబాలకు మండల పరిధి మద్దివంచ గ్రామంలో బుధవారం కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి రావాల్సిన మీటింగ్ వద్ద కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని నిరసన తెలియజేసి వెళ్తున్న రైతులపై దాడులు జరిపి వారి మరణానికి కారణమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. గత 11 నెలలుగా ఢిల్లీ సరిహద్దు ప్రాంతాల్లో రైతులు ధర్నా చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం పట్టించు కోవడం లేదని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం నల్లా చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బిక్షమయ్య, శ్రీనివాస్, పిచ్చయ్య ,జనార్ధన్ , వెంకన్న, బిక్షం , పుల్లయ్య, వెంకటేష్ ,రాంబాబు తదితరులు పాల్గొన్నారు.