Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భూపాలపల్లి
తెలంగాణ ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వరమని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. బుధవారం రేగొండ మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఎంపీపీ లక్ష్మిరవి అధ్యక్షతన సీఎం రిలీఫ్ ఫండ్, షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులతోపాటు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... రైతులకు రైతుబీమా, రైతుబంధు, రుణమాఫీ ప్రవేశపెట్టారన్నారు. నిరంతర విద్యుత్, కాలువల ద్వారా రెండు పంటలకు చివరి ఆయకట్టు వరకు నీరందిస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ప్రతిపక్షాలు బుదరజల్లే ప్రయత్నాలు మానుకోవాలని అన్నారు. తెలంగాణ అబివృద్ధి వైపు దేశం మొత్తం చూస్తున్నదని అన్నారు. అనంతరం రంగయపల్లి కొడవటంచా గ్రామాల్లో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. రేగొండమండల కేంద్రంలో ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన బండి ఓదెలు కుటుంబాన్నీ పరామర్శించి రూ.5వేలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. తహసీల్ధార్ జివాకర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్ విజన్రావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు అంకం రాజేందర్, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ సంతోష్, సర్పంచులు సంధ్య వెంకన్న, పబ్బ శ్రీనివాస్, ఎంపీటీసీ సుమలత భిక్షపతి, ప్రతాప్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు అంకం రాజేందర్, పీఏ సీఎస్ వైస్ చైర్మెన్ పాపిరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ఉమేష్, రాజేశ్వర్‌రావు, మహేందర్ పాల్గొన్నారు.