Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉప ఎన్నికల పరిశీలకులు డాక్టర్ ఓంప్రకాష్, అనుపమ్ అగర్వాల్
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే చర్యలపై గట్టి నిఘా విధించనున్నట్లు ఎన్నికల పరిశీలకులు డాక్టర్ ఓం ప్రకాశ్, పోలీసు పరిశీలకులు అనుపమ్ అగర్వాల్ తెలిపారు. బుధవారం హన్మకొండ జిల్లా కేంద్రానికి విచ్చేసిన ఎన్నికల పరిశీల కులకు వరంగల్ పోలీసు కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి, జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎన్నికల ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల పరిశీలకులు మాట్లాడుతూ ఈనెల 30న జరిగే హుజురాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పకడ్బందీగా అమలు చేస్తామన్నారు. హుజురాబాద్ నియోజకవర్గంలో పోటీలో వున్న వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికలలో చేసే ఖర్చులపై నిఘా పెడుతామన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేఏ డబ్బు పంపిణీ, మద్యం పంపిణీ, చీరెలు, ఇతర బహుమతుల పంపిణీపై దృష్టి
సారిస్తామన్నారు. నియోజకవర్గంలోని సరిహద్దుల్లో చెక్‌పోస్టుల వద్ద వాహనాల తనిఖీని పకడ్బందీగా చేయనున్నామన్నారు. రాజకీయ పార్టీలు చేసే ఖర్చుల వివరాలను ఎప్పకప్పుడు అధికారుల బృందాలు ప్రతి రోజు నమోదు చేయాలన్నారు. వీటిపై గట్టి నిఘా పెట్టాలని సూచించారు. ఉప ఎన్నిక నివేదికను ఎన్నికల సంఘానికి నివేదిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ వాసుచంద్ర, డిసిపి పుష్ప, హన్మకొండ తహశిల్దార్ రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.