Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన బతుకమ్మ సంబురాలు
- ఆటపాటలతో సందడి చేసిన యువత
- కిటకిటలాడిన వేయిస్థంబాల గుడి
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా బుధవారం బతుకమ్మ సంబురాలు ప్రారంభమయ్యాయి. హన్మకొండలోని వేయిస్థంబాల గుడిలో మహిళలు అధికసంఖ్యలో పాల్గొని బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. అలాగే వరంగల్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, జనగామ జిల్లావ్యాప్తంగా అంగరంగ వైభంగా బతుకమ్మ పండుగ ప్రారంభమైంది. పాలకులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పాల్గొని సందడి చేశారు. తెలంగాణ సాంస్కృతిసాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ అని కొనియాడారు.
మరిపెడ: తెలంగాణ సంస్కతి , సాంప్రదాయలకు ఆడపడుచులు ఔన్నత్యానికి ప్రతీకైనా బతుకమ్మ పండుగను జిల్లా ప్రజలందరు సంతోషంగా జరుపుకోవాలని గుడిపూడి నవీన్ రావు అన్నారు. బతుకమ్మ పండుగా ప్రారంభోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా ప్రజలకు నవీన్ రావు శుభాకాంక్షలు తెలియజేశారు. టి ఆర్ ఎస్ ప్రభుత్వం వచ్చాక బతుకమ్మ పండుగను అధికారికంగా నిర్వహిస్తూ రాష్ట్ర పండుగగా గుర్తించిందన్నారు. ప్రతి ఏటా తెలంగాణ ప్రభుత్వ బతుకమ్మ కానుకగా ఆడపడుచులలు చీరల పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఈ పండుగను ప్రజలందరు వేడుకగా , ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు.
మల్హర్రావు: బుధవారం మండలంలో ఎంగిలి పూల బతుకమ్మ వేడుకలు అంగరంగా వైభవంగా నిర్వహించారు. తాడిచెర్ల సాయి విద్యానికేతన్ ప్రయివేట్ పాఠశాలలో విద్యార్థులు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించి ఆటపాటలతో నృత్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ సంపత్ రావు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కొత్తగూడ: తాటివారివేంపల్లి సర్పంచ్ ఇరుప సూరమ్మ, ఉపసర్పంచ్ గుగులోత్ సురేష్ బుధవారం మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేసి మాట్లాడారు. ప్రభుత్వం తాగునీటి సౌకర్యం లేక మహిళలు పడుతున్న ఇబ్బందులు గుర్తించి ఆడబిడ్డలు ఎలాంటి కష్టాలు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో మీషన్ భగీరథ పథకం కింద ఇంటింటికీ నల్లా ఏర్పాటు చేసి ఇబ్బందులు లేకుండా చేయడం గర్వకారణమన్నారు.
చిన్నగూడూరు: మండల కేంద్రంతో పాటు జయ్యారం, విస్సంపల్లి, గుడంరాజుపల్లి, పగిడిపల్లి, ఉగ్గంపల్లి వివిధగ్రామాల్లో అమావాస్య, పెతారమాస మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మను బుధవారం ఘనంగా జరుపుకున్నారు.
తొర్రూర్ టౌన్: మండలంలోని అమ్మపురం, గుర్తురు వివిధ గ్రామాల్లో కోలాహలంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను మహిళలు అత్యంత వైభవంగా కోలాటాలతో జరుపుకున్నారు
గార్ల: బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు సర్పంచ్ వట్టం జానకి రాణి అన్నారు. బుధవారం ముల్కనూరు పంచాయతీ లో బతుకమ్మ ఘాట్ ను డోజర్‌తో శుభ్రం చేసి అన్ని ఏర్పాట్ల పనులను పర్యవేక్షించారు. ఈ ఉత్సవాల నిర్వహణకు ప్రజాప్రతినిధులు, మహిళలు తోడ్పాటును అందిం చాలని కోరారు. పనుల పర్వవేక్షణలో పంచాయతీ కార్యదర్శి రామకష్ణ తదితరులు ఉన్నారు.
పంచాయతీ కార్యదర్శి జి.లక్ష్మణ్, యువతులు, మహిళలు, చిన్నారులు తదితరులు ఉన్నారు.
బయ్యారం: మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని అన్ని గ్రామాలలో బుధవారం ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఏంగిలి పూల బతుకమ్మను అనేక రకాల పూలతో బతుకమ్మను పేర్చి ఆడపడుచులు నూతన వస్త్రాలు ధరించి స్థానిక బస్టాండ్ సెంటర్, గాంధీ సెంటర్ లలో బతుకమ్మ పాటలు పాడుతూ కోలాటాలతో కోలాహలంగా పాటలతో బతుకమ్మ వేడుకలు నిర్వహించుకున్నారు.
తొర్రూరు: తెలంగాణ సంస్కతి కి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకలు బుధవారం డివిజన్ కేంద్రంలోని పెద్ద చెరువు ఆవరణలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను స్థానిక మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, కమిషనర్ గుండె బాబు తో కలిసి బుధవారం ప్రారంభించారు. మహిళల బతుకమ్మ ఆటపాటలతో చెరువు ప్రాంగణం కోలాహలంగా మారింది. ఈ సందర్భంగా మహిళలు బతుకమ్మ పాటలకు లయబద్ధంగా కాలు కలుపుతూ నత్యాలు చేశారు. శ్రీ వినాయక ఫ్రెండ్స్ అసోసియేషన్అధ్యక్షుడు కందగట్ల సోమశేఖర్, గౌరవ అధ్యక్షులు రేవూరి నరసయ్య, ప్రధాన కార్యదర్శి బోనగిరి శంకర్, కూరపాటి జగన్‌ల సమక్షంలో ఎల్ వై ఆర్ గార్డెన్ వీధిలో 8 అడుగుల ఎత్తున భారీ బతుకమ్మను కోలాట నత్యాల నడుమ ర్యాలీగా పెద్ద చెరువుకు తీసుకెళ్లారు. 10వ వార్డు కౌన్సిలర్ దొంగరి రేవతి శంకర్ ఆధ్వర్యంలో పురపాలక కార్యాలయం నుంచి చెరువు దాకా బతుకమ్మలతో భారీ ర్యాలీ నిర్వహించారు.బతుకమ్మ వేడుకలను చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, కమిషనర్ గుండె బాబు, సిఐ కరుణాకర్ రావు, ఎస్సై గండ్రాతి సతీష్ లు పర్యవేక్షించారు. మునిసిపల్ సిబ్బంది బతుకమ్మలను చెరువులో విడిచారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి భద్రతా చర్యలు చేపట్టారు.