Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా కన్వీనర్ శ్రీధర్ గౌడ్
నవతెలంగాణ-పాలకుర్తి
రాజ్యాధికారం కోసం బహుజనులు అందరూ ఏకం కావాలని మహాజన సోషలిస్టు పార్టీ జిల్లా కన్వీనర్ సీసా శ్రీధర్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆదివారం మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ ఇన్చార్జి చేరిపెళ్లి యాదగిరి స్వామి అధ్యక్షతన జరిగిన సమావేశానికి శ్రీధర్ గౌడ్ పాల్గొని మాట్లాడుతూ సకల జనుల సమ్మెతో తెలంగాణ ప్రజలు కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో దళిత బహుజనులకు రాజకీయ సామాజిక ఆర్థిక పరంగా న్యాయం జరుగుతుందన్నారు. ఈ నెల 17న జనగామలో రాజ్య నిర్మాణానికి సన్నద్ధం కావాలని సంకల్పంతో మహా జనచైతన్య సభను ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహాజన సోషలిస్టు పార్టీ, ఎమ్మార్పీఎస్ నాయకులు నరేష్, రామచంద్రు, రాజు, ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు