Authorization
Sun March 23, 2025 10:20:47 am
నవతెలంగాణ-తాడ్వాయి
మండలంలోని మేడారంలో ఆదివారం జన సందోహం నెలకొంది. సమ్మక్క, సారలమ్మ, పగి డిద్దరాజు, గోవిందరాజు వనదేవతల గద్దెలకు సందర్శకులు మొక్కులు చెల్లించారు. ఆనవాయితీ ప్రకారం తొలుత జంపన్న వాగులో స్నానాలు ఆచరించి గద్దెల వద్దకు చేరుకొని పసుపు, కుంకుమ, చీరె, సారె, గాజులు, బంగారం(బెల్లం) సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ సాంప్రదా యాల ప్రకారం పూజారులు, దేవాదాయ శాఖ అధికా రులు ఏర్పాట్లు చేశారు. తెలంగాణ, ఏపీ నుంచే కాకుండా ఛత్తీస్ఘడ్, ఇతర రాష్ట్రాల నుంచి కూడా జనం భారీగా తరలిరావడం కనిపిం చింది. మొక్కులు చెల్లించిన అనంతరం జనం అటవీ ప్రాంతంలో విందు చేసుకుని సేద తీరారు.
చలువ పందిళ్లు లేక వెతలు
మండుటెండలో పరుగులు
మేడారం సమ్మక్క-సారక్క గద్దెల ప్రాంగణంలో చలువ పందిళ్లు ఏర్పాటు చేయకపోవడంతో సందర్శకులకు ఇబ్బందులు తప్పలేదు. ఆదివారం మధ్యాహ్నం మండుటెండలో సందర్శకులు పరుగులు తీయాల్సిన దుస్థితి నెలకొంది. వనదేవతల దర్శనం కోసం వచ్చిన ప్రజలు ఎండలకు తాళలేకపోవడం కనిపించింది. అధికారులు సమ్మక్క-సారలమ్మ గద్దెలపై మాత్రమే చలువ పందిళ్లు వేసి వదిలేయడం విమర్శలకు, సందర్శకుల అసహనానికి కారణమైంది. వనదేవతల ప్రాంగణంలోని గద్దెలకు ప్రదక్షిణలు చేసే ప్రజలు, గద్దెలను