Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడ
ఆదివాసీలు విద్య, ఉపాధి కోసం పోరాడా లని కాకతీయ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ ఈసం నారాయణ కోరారు. మండల కేంద్రంలో ఆది వాసీ నిరుద్యోగ సంఘం ఆధ్వర్యంలో 'ఆదివాస ీల సంస్కతి, సంప్రదాయం, విద్య, ఉపాధి' అంశంపై ఆదివారం నిర్వహించిన సెమినార్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆదివాసీలు ఉన్నత విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ ఉద్యోగాలపై ఆశలు పెట్టుకోకుండా వృత్తి విద్యా కోర్సులపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఆది వాసీ హక్కుల పట్ల పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకుని చైతన్యవంతం కావాలని కోరారు. కార్యక్రమంలో పీసా ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ కొమురం ప్రభాకర్, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు వట్టం ఉపేందర్, నాయకులు పూనెం సందీప్, మల్లెల రణధీర్, వాసం వీరస్వామి, సుంచ సారయ్య, తదితరులు పాల్గొన్నారు.