Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ
సభ్యుడు జి నాగయ్య
నవతెలంగాణ-మహబూబాబాద్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా, కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యుడు జి నాగయ్య పిలుపునిచ్చారు. ఆ పార్టీ పట్టణ 13వ మహాసభ సందర్భంగా జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం నుంచి మదర్ తెరిసా సెంటర్ వరకు ఆదివారం రెడ్ షర్ట్ వాలంటీర్ల కవాతు నిర్వహించారు. అనంతరం వర్తక సంఘం భవనం వద్ద సీనియర్ నాయకుడు చింతల భిక్షపతి పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం తోట భిక్షం నగర్, గాడిపల్లి వెంకన్న, వేల్పుల కొమురయ్య ప్రాంగణంలో ఆల్లి శ్రీనివాస్‌రెడ్డి, చాగంటి భాగ్యమ్మ, ధరావత్ హేమనాయక్ అధ్యక్షతన మహాసభ నిర్వహించగా ముఖ్యఅతిథిగా నాగయ్య హాజరై మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీఆర్ఎస్ పార్టీలు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నారని విమర్శించారు. కేంద్రంలో రెండోసారి అధికారం లోకి వచ్చాక బీజేపీ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభం మరింతగా పెరిగిందన్నారు. వ్యవసాయ, పారిశ్రామిక, కార్మిక చట్టాలకు సవరణలు చేయడంతోపాటు ప్రభుత్వ రంగ రైల్వే, బ్యాంకింగ్, ఎల్ఐసీ,