Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కేజీకేఎస్ జిల్లా కార్యదర్శి బుర్ర శ్రీనివాస్
నవతెలంగాణ-గోవిందరావుపేట
కల్లు గీత వత్తి రక్షణ కోసం గౌడబంధు పథకం ప్రకటించి అమలు చేయాలని కేజీకేఎస్ జిల్లా కార్యదర్శి బుర్ర శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండలం లోని పసర గ్రామంలోని గౌడ కమ్యూనిటీ హాలులో జక్కు నర్సయ్య అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన సమావేశానికి శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రభుత్వం ప్రకటించిన వైన్ షాపుల్లో రిజర్వేషన్ల వల్ల ఒరిగేదేమీ లేదన్నారు. దళిత బంధు మాదిరిగా గౌడ బంధు పేద గీత వృత్తిదారుల కుటుంబాలకు రూ.10 లక్షలు చొప్పున సాయం అందించాలని ఆకాంక్షించారు. అలాగే కల్లు గీత వత్తిదారుల సంక్షేమం కోసం బడ్జెట్లో రూ.5 వేల కోట్లు కేటాయించి జిల్లాలో నీరా ప్రాజెక్టు నెలకొల్పాలని, ఏజెన్సీ ప్రాంత వృత్తిదారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేయాలని, అర్హులకు గుర్తింపు కార్డులివ్వాలని, పింఛన్ రూ.2500లకు పెంచాలని, వృత్తిదారులకు ద్విచక్ర వాహనాలు అందించాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. హక్కుల సాధన, సమస్యల పరిష్కారం కోసం గీత కార్మికులు సర్దార్ సర్వాయి పాపన్న స్పూర్తితో ఉద్యమాలకు సిద్ధం కావాలని కోరారు. సమావేశంలో నాయకులు బొమ్మగాని జానీ, రమేష్, జక్కు రాజు, మొగిలి, భిక్షపతి, రవి, శోభన్, కక్కెర్ల శ్రీనివాస్, మహేష్, మేరుగు సుధాకర్, జక్కు శ్రీనివాస్, దొనికెల మల్లికార్జున్, పూజారి సారంగం, నర్సయ్య, ఓంకార్ తదితరులు పాల్గొన్నారు.