Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నెక్కొండ రూరల్
సభ్యత్వ నమోదులో రాష్ట్రంలో తృతీయా స్థానంలో నిలిచి ముందంజలో ఉన్నందుకు పీఆర్టీయూ మండల కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శిలను సన్మానించారు. ఆదివారం నిజామాబాద్‌లో నిర్వహించిన రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో మండల కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, మాలోతు ప్రతాప్‌సింగ్, కర్ర యాకుబ్రెడ్డిలు రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బీరెల్లి కమలాకర్‌రావులు సన్మానించారు. అనంతరం రాష్ట్ర కమిటీకి పీఆర్టీయూ మండల కమిటీ బాధ్యులు ప్రతాప్‌సింగ్, యాకుబ్‌రెడ్డి, గురిజాల శ్రీధర్ రెడ్డి, రాపోలు యాకయ్యలు శుభాకాంక్షలు తెలియ జేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్ధన్ రెడ్డి, రఘోత్తం రెడ్డి హాజరయ్యారు.
మండల వాసులకు రాష్ట్ర కమిటీలో చోటు..
మండలవాసులకు పీఆర్టీయూ రాష్ట్ర కమిటీలో చోటు దక్కింది. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా రాపోలు యాకయ్య, ఉండ్రాతి సుజన్ తేజ, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా రవీం ద్ర నాథ్, విజయ భాస్కర్ రెడ్డి, రాష్ట్ర కార్యద ర్శులుగా శ్రీనాథ్, రవి, ప్రవీణ్‌లు ఎన్నికయ్యారు.