Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
రైస్ మిల్లర్స్ అసోసియేషన్
నూతన భవన ప్రారంభోత్సవం..
నవతెలంగాణ-నర్సంపేట
వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తూ రైతులకు అండగా నిలుస్తూ వ్యాపారులకు సహకారం అందిస్తుందని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని మల్లంపల్లి రోడ్లో రైస్ మిల్లర్ అసోసియేషన్ నూతన భవనాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన నర్సంపేటలో మరిన్ని అనుబందం పరిశ్రమలను నెలకొల్పేందుకు ప్రభుత్వం యోచిస్తోందన్నారు. వ్యక్తిగతంగా తాను ఇరవై యేండ్లుగా రైస్‌మిల్లర్ల ప్రతి సమస్యను పరిష్కరించే వ్యక్తిగా ముందు వరుసలో ఉన్నానని గుర్తు చేశారు. కలలు సాకారమైన స్వరాష్టంలో పరస్పర సహకారం అభివద్ధిని కాంక్షిస్తుందని తెలిపారు. వ్యాపారంలో వచ్చే అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని నిలబడి ఈ స్థాయికి రావడం అభినందనీయమన్నారు. ప్రభుత్వం ఈ మేరకు సహాయ సహకారాలు ఎప్పటికి అందించడానికి సిద్ధంగా ఉందన్నారు. నియోజకవర్గ అభివద్ధిలో అందరి సలహా సూచనలతో అనేక సంక్లిష్ట సమస్యలను అధికమించామని చెప్పారు. ఇకపై రాజకీయాలు ఉండవని, సంక్షేమ పాలనే ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగుతామన్నారు. ప్రతి ఎకరాకు సాగు నీరు అందించడానికి ప్రాజెక్టులు, గోదాముల నిర్మాణాలు పూర్తి చేశామన్నారు. గతంతో పోల్చితే పెరిగిన పంట దిగుబడే ప్రగతికి కొలమానంగా నిలుస్తుందని తెలిపారు. నియోజకవర్గ అభివద్ధిలో పాలుపంచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ హరిసింగ్, ఆర్డీఓ పవన్ కుమార్, స్టేట్ ఫుడ్ అడ్వైజర్ కమిటీ మెంబర్ సంగులాల్, నర్సంపేట మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజని కిషన్, వైస్ చైర్మన్ మునిగాల వెంకట రెడ్డి, జెడ్పీ టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్ష్యులు గోనెల రవీందర్, వరంగల్ జిల్లా అధ్యక్ష్యులు తోట సంపత్ కుమార్, నర్సంపేట రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ముఖ్యులు సింగిరికొండ మాధవ శంకర్ , మోతె జయపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.