Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సీపీఐ(ఎం) వరంగల్ జిల్లా
కార్యదర్శి సీహెచ్ రంగయ్య
నవతెలంగాణ-మట్టెవాడ
ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టి కార్పొరేట్ సంస్థలకు ప్రజాధనాన్ని దోచిపెడుతున్న పాలకులకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని సీపీఐ(ఎం) వరంగల్ జిల్లా కార్యదర్శి సీహెచ్ రంగయ్య, రాష్ట్ర కమిటీ సభ్యురాలు రత్నమాల అన్నారు. ఆదివారం రామన్నపేట్ మణిద్వీప గార్డెన్లో ఆరూర్ కుమార్, రంగరాజు విజరు అధ్యక్షతన పార్టీ మహాసభను నిర్వహించారు. ఈ సభకు వారు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు ప్రజా సంపదను దోచుకునేందుకు నూతన వ్యవసాయ చట్టాలను తీసుకు వచ్చారని మండ ిపడ్డారు. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు కట్టబెడుతూ, నిత్యవసర పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి ప్రజలపై పెనుభారం వేస్తున్నారని కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలకు అవ లంభిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పేందకు పోరాటాలు నిర్వహించాలన్నారు. ఈ విధానాలను తిప్పి కొట్టేందుకు నిర్వహించే పోరాటాలలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు అనంతరం సభలో కార్యదర్శి సింగారపు బాబు తీర్మానాలను ప్రవేశపెట్టగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు చుక్కయ్య, కొల్లజు రమేష్, చెవుల శ్రీనివాస్, బి సంగీత తదితరులు పాల్గొన్నారు.