Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఏటూరునాగారం
డబ్బులు, పదవులు ఎరగా వేయడం ద్వారా కాంగ్రెస్లో చిచ్చు పెట్టేందుకు టీఆర్ఎస్ నాయకులు కుట్ర చేస్తున్నారని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఇర్సవడ్ల వెంకన్న, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు మహ్మద్ అయూబ్ ఖాన్ అన్నారు. మండల కేంద్రంలో ఆ పార్టీ మండల అధ్యక్షుడు చిటమట రఘు అధ్యక్షతన సోమవారం నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథులుగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇర్శవడ్ల వెంకన్న, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు అయ్యూబ్ ఖాన్ హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులను టీఆర్ఎస్లో చేర్చుకునేందుకు కుట్ర జరుగుతోందని అనుమానం వ్యక్తం చేశారు. డబ్బు, పదవులకు లొంగని కాంగ్రెస్ నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పారు. టీఆర్ఎస్ దౌర్జన్యానికి బెదిరేది లేదని స్పష్టం చేశారు. పార్టీ నాయకులను, కార్యకర్తలను కాపాడుకుంటామని తెలిపారు. కన్నాయిగుడెం జెడ్పీటీసీ నామా కరమ్ చంద్ గాంధీ మాట్లాడుతూ ప్రజాక్షేత్రంలో గెలవలేక కాంగ్రెస్ పార్టీ కండువాతో గెలిచిన ప్రజాప్రతినిధులకు ఎర వేయడం సరికాదన్నారు. ప్రజాక్షేత్రంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ వెనకాల ఎంత బలం ఉందో తెలుస్తుందని చెప్పారు. సమావేశంలో పార్టీ కన్నాయిగూడెం మండల అధ్యక్షుడు అఫ్సర్, మండల ప్రధాన కార్యదర్శి వావిలాల ఎల్లయ్య, నాయకులు మహ్మద్ ఖలీల్ ఖాన్, మహ్మద్ రియాజ్, ముస్తఫా, ఫరూక్, మహ్మద్ గౌస్, వసంత శ్రీను యాదవ్, వావిలాల నర్సింహారావు, పెడ్డబోయిన నర్సింహారావు, ముక్కెర లాలయ్యి, మనోజ్, రాజబాబు, లక్ష్మణ్, పడిదల హన్మంతు, కూరపాటి కుమారస్వామి, మహ్మద్ పాషా, చింతకింది రాజు, ఖయ్యూమ్, అజ్మత్, మునీర్, కిరణ్, చేల వినరు, తదితరులు పాల్గొన్నారు.