Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కాంగ్రెస్లో పలువురి చేరిక
నవతెలంగాణ-కొత్తగూడ
కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అండగా ఉంటానని ములుగు ఎమ్మెల్యే సీతక్క భరోసా ఇచ్చారు. కొత్తగూడ, గంగారం మండలాలకు చెందిన పలువురు టీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు సమారు వంద మంది మండల కేంద్రంలో సోమవారం కాంగ్రెస్లో చేరగా వారికి సీతక్క కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే పొగుళ్లపల్లి నుంచి టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దూదిమెట్ల లింగయ్య కాంగ్రెస్లో చేరగా ఆయన్నూ సీతక్క పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం సీతక్క మాట్లాడారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం పోరాడటమే తన లక్ష్యమని స్పష్టం చేశారు. అంతకు మించి తనకు ఇతర వ్యాపకాలేవీ లేవన్నారు. నియోజకవర్గ ప్రజలను, పార్టీ శ్రేణులను కంటికి రెప్పలా కాపాడుకుంటానని తెలిపారు. ఎవరికి ఏ సమస్య ఎదురైనా తాను ఆదుకుంటానని హామీ ఇచ్చారు.
లబ్దిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ
కొత్తగూడ, గంగారం మండలాలకు చెందిన 10 మందికి ఎమ్మెల్యే సీతక్క సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదలు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ చల్లా నారాయణరెడ్డి, కాంగ్రెస్ పార్టీ కొత్తగూడ, గంగారం మండలాల అధ్యక్షులు వజ్జ సారయ్య, జాడి వెంకటేశ్వర్లు, వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకరబోయిన మొగిలి, మండల ప్రధాన కార్యదర్శి బిట్ల శ్రీను, కొత్తగూడ, గంగారం మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు బానోత్ విజయ రూప్సింగ్, పులుసం పుష్పలత, సువర్ణపాక సరోజన జగ్గారావు, ఈసం రమ సురేష్, వైస్ ఎంపీపీలు కాడబోయిన జంపయ్య, ముడిగ వీరభద్ర పోతయ్య, మండల నాయకులు రాజం సారంగం, వీరనేని వెంకటేశ్వర్లు, బానోత్ శంకర్, బైరబోయిన యాకన్న, తదితరులు పాల్గొన్నారు.