Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ పట్టణ అభివద్ధి కోసం పోరాటాలు
అ సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జహంగీర్
నవెతలంగాణ-భువనగిరి
ప్రజా కార్మిక వ్యతిరేక పాలన కొనసాగిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి .జహంగీర్ పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలో రిటైర్డ్ పెన్షనర్ల భవనంలో ఆ పార్టీ పట్టణ 12వ మహాసభ పార్టీ సీనియర్ నాయకులు గద్దె నరసింహ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా జహంగీర్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా ,కార్మిక వ్యతిరేకంగా పాలన కొనసాగిస్తోందన్నారు. ప్రజలపై అనేక భారాలు మోపుతుందన్నారు. పెట్రోల్, డీజిల్ గ్యాస్ నిత్యావసర వస్తువుల ధరలను రోజురోజుకు పెంచుతూ పేద, మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తున్నారు. దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులను బడా పెట్టుబడిదారుల కట్టబెడుతూ పాలన కొనసాగిస్తుందన్నారు. ఒకవైపు కరోనాతో అనేక మంది మతి చెందిన మరోవైపు కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచుతూ అధిక భారాలు మోపుతోందన్నారు. దేశంలో రైతు వ్యతిరేక చట్టాలను, కార్మిక వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చి పార్లమెంట్లో మెజారిటీ ఉందని నూతన చట్టాలు ప్రవేశపెట్టిందన్నారు. దీంతో దేశంలో ఉన్న భూములు వ్యవసాయం లాంటి దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్ప జెప్పటం జరుగుతుందన్నారు. దేశంలో ఉన్న పేద మధ్యతరగతి ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ఉందన్నారు. ప్రజా సంపదకు నష్టం చేస్తున్న బీజేపీని గద్దె దించాలని పిలుపునిచ్చారు. పట్టణంలో అభివద్ధి పనులు నత్తనడక నడుస్తున్నాయన్నారు. మౌలిక సదుపాయాల కల్పనలో పాలకులు విఫలమయ్యారన్నారు. స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజలను చైతన్యపరిచి పోరాటాలకు సిద్ధం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, కల్లూరి మల్లేశం, బొడ్డుపల్లి అనురాధ, జిల్లా కమిటీ సభ్యులు మాయ కష్ణ, నాయకులు గంధ మల్ల మాతయ్య, వల్దాస్ అంజయ్య, బందెల ఎల్లయ్య, దాసరి మంజుల, దండు గిరి, వనం రాజు, కుమార్, వెంకటేష్ కల్లూరి నాగమణి, కళమ్మ, అనిత, పర్వతం బాలకష్ణ, ముత్యాలు, నాగభూషణం పాల్గొన్నారు.