Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మనస్తాపంతో అత్త, కోడళ్ల ఆత్మహత్యాయత్నం
అడ్డుకున్న సిబ్బంది
విచారణ చేసిన డీిఆర్ఓ, ఏసీపీ
న్యాయం చేస్తామని బాధితులకు హామీ
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ఇంటిని కబ్జా చేసిన వారితో పోలీసులు కుమ్మక్కయ్యారని మనస్తాపం చెందిన అత్తా, కోడళ్లు పెట్రోల్ పోసుకొని ఆత్మాహుతియత్నం చేశారు. వెంటనే గమనించిన సిబ్బంది వారిని వారించారు. ఈ ఘటన సోమవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లో గ్రీవెన్స్‌సెల్ జరుగుతున్న క్రమంలో జరిగింది. ఘటన పూర్వపరాల్లోకి వెళితే.. హన్మకొండ బాలసముద్రంలోని శ్రీనివాసకాలనీలో గతంలో ప్రభుత్వం శెట్టి పాపమ్మకు 60 గజాల అసైన్డ్ భూమిని ఇచ్చింది. ఈ భూమిలో పాపమ్మ కూతురు తిరుపతమ్మ, కోడలు కావేరి నివాసముంటున్నారు. ఈ ఇంటిని తిరుపతమ్మ, కావేరిలకు తెలియకుండానే పాపమ్మ తమ్ముడు పీట్ల శ్రీను, జంగిలి విజేందర్కు అమ్మేశాడు. పీట్ల శ్రీను రౌడీషీటర్ కావడంతో ఆయన నుంచి డబ్బులు తీసుకోలేక విజేందర్ ఆ ఇంటిని ఆక్రమించుకునే ప్రయత్నం చేయగా తిరుపతమ్మ అడ్డుకుంది. ఈ క్రమంలో ఈ రెండు వర్గాల మధ్య వివాదం నెలకొంది. ఈ క్రమంలో తన ఇంటిని తనకు ఇప్పించాలని విజేందర్ గతంలో వరంగల్ ప్రెస్‌క్లబ్‌లోని సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపిన విషయం విదితమే. ఇదిలావుంటే తాజాగా జంగిలి విజేందర్ నలుగురిని తీసుకువెళ్లి తిరుపతమ్మ, కావేరిలను బలవంతంగా ఖాళీ చేయించే ప్రయత్నం చేశారు. దీంతో తిరుపతమ్మ, కావేరిలు సుబేదారి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. న్యాయం చేయకపోవగా, జంగిలి విజేందర్‌తో కుమ్మక్కై దొంగ కేసు పెట్టి మమ్మల్ని లోపలేస్తామని పోలీసు అధికారులు బెదిరించడంతో చేసేదేమి లేక ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డామని బాధితులు తెలిపారు. హన్మకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు ఆదేశాల మేరకు వరంగల్ డీిఆర్ఓ వాసుచంద్ర, హన్మకొండ ఏసీపీ జితేందర్‌రెడ్డి శ్రీనివాసకాలనీకి వెళ్లి తిరుపతమ్మ నివాసముంటున్న ఇంటి విషయం గురించి స్థానికుల నుంచి సమాచారం సేకరించి విచారణ చేశారు. అనంతరం బాధితులకు న్యాయం చేస్తామని హామీఇచ్చారు. ఇటువంటి పనులు మరోమారు చేయొద్దని సూచించారు.