Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మహబూబాబాద్
బాలికలు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆకాంక్షించారు. అంత ర్జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించు కొని జిల్లాలో వివిధ రంగాల్లో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న బాలికలను కలెక్టరేట్లోని తన ఛాంబర్లో కలెక్టర్ శశాంక సోమవారం శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. బాలికలు విద్య, ఉద్యోగం, ఉపాధి, క్రీడలు, తదితర అన్ని రంగాల్లోనూ రాణించాలని కోరారు. బేటీ పడావో బేటీ బచావో కార్యక్రమాన్ని విస్తత ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు. బాలికల పరిరక్షణకు కృషి చేస్తున్న కమిటీని అభినందించి ప్రచార పోస్టర్ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో బాలల పరిరక్షణ కమిటీ చైర్పర్సన్ నాగవాణి, అదనపు కలెక్టర్లు అభిలాష అభినవ్, కొమరయ్య, మహిళా శిశుసంక్షేమ శాఖ అధికారి స్వర్ణలత, లెనిన్, సీడీపీఓ డెబోరా, తదితరులు పాల్గొన్నారు.