Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడ
అధికారులు నిర్లక్ష్యం వీడి ప్రజాసమస్యల పరిష్కారానికి కషి చేయాలని ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క కోరారు. మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో అధికారులతో అభివృద్ధి పనులపై సోమవారం ఆమె సమీక్షించారు. అనంతరం సీతక్క మాట్లాడారు. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎందుకు పునాదుల వద్దే నిలిచిపోయాయని సంబంధిత అధికారులను ప్రశ్నించారు. రివ్యూ మీటింగ్కు హాజరు కాని ఆర్ అండ్ బీ డీఈపై సెల్ఫోన్ ద్వారా ఎమ్మెల్యే సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెండింగ్లో ఉన్న సీసీ రోడ్లను త్వరగా పూర్తి చేసేలా ఆయా శాఖల అధికారులు చర్యలను వేగవంతం చేయాలన్నారు. అలాగే కాంట్రాక్టులు దక్కించుకుని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పనులు చేయని వారికి నోటీసులు అందజేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులు ప్రజాప్రతినిధులు, ప్రజలతో సమన్వయం పెంచుకుని సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ఆకాంక్షించారు. సమావేశంలో ఎంపీపీ బానోత్ విజయ రూప్సింగ్, జెడ్పీటీసీ పులుసం పుష్పలత, వైస్ ఎంపీపీ కాడబోయిన జంపయ్య, ఎంపీడీఓ కరణ్ సింగ్, ఎంపీఓ సత్యనారాయణ, ఐబీ డీఈ చెన్నకేశవరెడ్డి, ఐటీడీఏ డీఈ మధూకర్, ఐబీ ఏఈలు అనూష, విజయ, ఐటీడీఏ ఏఈ రవి, పీఆర్ ఏఈ యశ్వంత్, తదితరులు పాల్గొన్నారు.