Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంగపేట
మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ఆర్టీసీ బస్ సౌకర్యం కల్పించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు తోకల రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో కళాశాల నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు సోమవారం నిరసనా ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. అనంతరం ఆర్ఐ సునీల్ కుమార్కు కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రవి మాట్లాడారు. మండల కేంద్రానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలోని బ్రాహ్మణపల్లి, రాజు పేట, నర్సింహసాగర్, కొత్తపేట, బుచ్చంపేటల నుంచి కాలేజీకి వచ్చే విద్యార్థులు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. కళాశాలలో సుమారు 300 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, వారంతా ప్రయివేట్ వాహనాలను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోతున్నారని తెలిపారు. ఈ క్రమంలో పేద, మధ్య తరగతి విద్యార్థులు చదువులకు దూరమయ్యే ప్రమాదం ఏర్పడుతోందని ఆందోళన వెలిబుచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి వెంటనే బస్సు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రభుత్వం ప్రమోట్ చేసిన ఇంటర్ విద్యార్థులకు మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించాలని, పరీక్షల నిర్వహణపై ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు పునరాలోచించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం నాయకులు మేరేజ్ ఖాన్, వీరాజ్, శివ, షఫీ, బాలాజీ, వంశీ, వినరు, తదితరులు పాల్గొన్నారు.