Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మోడీ ఫాసిస్టు విధానాలను ఖండించండి
నవతెలంగాణ-నర్సంపేట
నల్ల చట్టాలను రద్దు చేయాలని రైతులు యేడాదిగా పోరాటాలను నిర్వధికంగా కొనసాగిస్తుండగా పట్టించుకోకుండా హత మార్చడానికి పూనుకోనే చర్య అత్యంత దుర్మార్గమని తెలంగాణ రైతు సంఘం వరంగల్ జిల్లా కార్యదర్శి కొరబోయిన కుమారస్వామి అన్నారు. సీఐటీయు ఆధ్వర్యంలో పట్టణంలోని అమరవీరుల స్తూపం ఎదుట ఇటివల ఉత్తర ప్రదేశ్‌లోని లఖీంపూర్‌లో బీజేపీ కుట్రలకు బలైన రైతు అమరవీరులకు కొవ్వత్తులతో శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోడీ రైతుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తూ ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూని చేస్తున్నాడన్నారు. వ్యవసాయ నల్ల చట్టాలు రైతులకే కాదు దేశ ప్రజలకు తీరని అన్యాయం చేస్తుందని, వాటిని రద్దు చేయాలని ప్రజాస్వామయుతంగా పోరాడుతుండగా మోడీ ఫాసిస్తు విధానాలను అవలంబిస్తూ చివరికి రైతులను హతమార్చాలని కుట్రపన్నడం హేయమైన చర్యని విమర్శించారు. ఇందులో భాగంగానే ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌లో శాంతియుతంగా రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపై కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రి కుమారుడు తమ మోటార్ వాహనంతో నలుగురు రైతులను పత్రికా విలేకరిని తొక్కి చంపడం నిదర్శమన్నారు. వెంటనే రైతుల మతికి కారకుడైన హౌం శాఖ సహాయ మంత్రి కుమారుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలని, లేకపోతే ప్రజల చేతిలో గుణపాఠం ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి హన్మకొండ శ్రీధర్, సీఐటీయు జిల్లా కార్యదర్శి అనంతగిరి రవి, రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘం, సీఐటీయు నాయకులు మండల అశోక్, నిమ్మలబోయిన రమేష్, తెలుకలపల్లి లక్ష్మి నారాయణ, కందికొండ రాజు, లక్క శ్రీకాంత్, ఆవుల సందీప్, సాయికుమార్, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-ఎల్కతుర్తి
లఖింపూర్ ఘటనను నిరసిస్తూ సోమవారం మండల కేంద్రంలో సీపీఐ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకులు మాట్లాడుతూ.. నూతన వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని నిరసన తెలుపుతున్న రైతులపైకి కేంద్ర సహాయ మంత్రి అజరు మిశ్రా కుమారుడు అశిష్ మిశ్రా కారుతో తొక్కించి నలుగురి మృతికి కారణమయ్యాడని మండిపడ్డారు. వెంటనే కేంద్ర సహాయ మంత్రిని పదవీ నుంచి తొలగించడంతోపాటుగా నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌చేశారు. ఈకార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శ ఊటుకూరి రాములు, జిల్లా కార్యవర్గ సభ్యులు కర్రే లక్ష్మణ్, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నెట్టెం నారాయణ, సీపీఐ జిల్లాసమితి సభ్యుడు మరి శ్రీనివాసు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-భీమదేవరపల్లి
కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ముల్కనూర్ బస్టాండ్ కూడలి వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం దహనం చేశారు. ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ.. శాంతియుతంగా నిరసన చేపట్టిన రైతులపై కేంద్ర మంత్రి కుమారుడు కారు నడిపి హత్యలు చేయడం దారుణమన్నారు. అహంకార పూరిత కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రజలు గ్రహించాలన్నారు ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు, అఖిలపక్ష నాయకులు తదితరులు పాల్గొన్నారు.