Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మంత్రి హరీష్ రావు
నవతెలంగాణ-ఎల్కతుర్తి
నల్ల చట్టాలు తీసుకొచ్చి రైతుల నడ్డి విరిచిన బీజేపీకి ఓటు వేస్తారా, రైతు బంధు.. రైతు బీమాతో.. ఆదుకున్న టీఆర్ఎస్కు ఓటు వేస్తారో ఆలోచించుకుని ఓటు వేయాలని ఆర్థిక శాఖ మంత్రి టీ హరీష్ రావు అన్నారు. మండలంలోని పెంచికల్‌పేట శివారులో సోమవారం ఏర్పాటు చేసిన మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నల్లచట్టాలు తెచ్చి బీజేపీ రైతుల నడ్డి విరుస్తోందన్నారు. రైతుల కోసం కాళేేశ్వరం ప్రాజెక్టు, రైతు బంధు, రైతు బీమా, మిషన్ కాకతీయ ప్రాజెక్టులను టీఆర్ఎస్ చేపట్టిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సామాన్యులను ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. ఈ క్రమంలోనే వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్, నిత్యావసర వస్తువుల ధరలను అమాంతం పెంచేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్తులు కాపాడుకోవడం కోసం ఈటల రాజేందర్ బీజేపీలో చేరాడన్నారు. రైతులకు మేలు చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌కు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్, చీప్ విప్ వినరు భాస్కర్, తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, కామారెడ్డి ఎమ్మెల్యే సురేష్, మున్నూరు కాపు ఆహ్వాన కమిటీ చైర్మన్ రవీందర్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, కౌశిక్ రెడ్డి, మండల ప్రజా పరిషత్ చైర్మన్ తంగెడ నాగేష్, హుజరాబాద్ మార్కెట్ డైరెక్టర్ తంగెడ మహేందర్, సర్పంచ్ సామల జమున సురేష్ రెడ్డి, మాజీ సర్పంచ్ దుగ్యాల సమ్మయ్య, ఎంపీటీసీ చెవుల కొమురయ్య, తదితరులు పాల్గొన్నారు