Authorization
Mon March 24, 2025 03:57:14 am
డీఎం థామస్
నవతెలంగాణ- ఆత్మకూరు.
ఖాతాదారులు కెనరా బ్యాంకు ద్వారా తమ అవసరాలకు రుణాలు పొంది అభివద్ధి చెందాలని డివిజనల్ మేనేజర్ థామస్ అన్నారు. సోమవారం కెనరా బ్యాంక్ మేనేజర్ భాను కుమార్ అధ్యక్షతన ఖాతాదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డివిజనల్ మేనేజర్ థామస్, సీనియర్ మేనేజర్ అనిల్‌లు హాజరై మాట్లాడారు. కెనరా బ్యాంక్ అందిస్తున్న వివిధ రకాల సేవలను అన్ని వర్గాల ఖాతాదారులు వినియోగించుకోవాలని సూచించారు. అదేవిధంగా గహ, వ్యవసాయ ఆధారిత, గోల్డ్ తనఖా, వాహన, విద్య ,మహిళా గ్రూపు తదితర రుణాలు ఇచ్చేందుకు కెనరా బ్యాంక్ ఎప్పుడూ ముందు ంటుందన్నారు. ఖాతాదారులు వారికి అవసరమైన రుణాలు పొందవచ్చని పేర్కొన్నారు. గతంలో తీసుకున్న రుణ గ్రహీతలు సకాలంలో చెల్లించినట్లైతే వారికి రెట్టింపు రుణాలు ఇస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ కొత్తపల్లి భాను కుమార్, ఏఈఓ శ్రీకాంత్, బ్యాంక్ వ్యవసాయ విస్తరణ అధికారి సౌదామిని, ఆఫీసర్లు అశోక్, రాజేష్, బాలకష్ణ, రణధీర్, రాజ్ కుమార్, ప్రశాంత్, విజరు కుమార్, వైకుంఠం, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.