Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య
నవతెలంగాణ-జనగామ
జిల్లాలో వంద శాతం వ్యాక్సినేషన్ దిశగా వ్యాక్సినేషన్ కు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య అన్నారు. సోమవారం జనగామ పట్టణంలోని 7, 8, 9, 10 వార్డుల్లో, బచ్చన్నపేట మండలం తమ్మడపల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన వ్యాక్సినేషన్ కేంద్రాలను తనిఖీ చేస వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించి కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో 18 సంవత్సరాల వయస్సు నిండిన వారు 3 లక్షల 66 వేల 453 మంది ఉండగా, ఇప్పటి వరకు 3 లక్షల 14 వేల 426 మందికి (85.80 శాతం) మొదటి డోస్ వ్యాక్సిన్ ఇచ్చినట్లు తెలిపారు. ఇప్పటివరకు 84 వేల 873 మందికి (26.99 శాతం) రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకున్నట్లు చెప్పారు. రెండో డోస్ తీసుకోవాల్సిన వారి వివరాలను సబ్ సెంటర్ల, పట్టణంలోని వార్డుల వారీగా ప్రత్యేక అధికారులకు, వ్యాక్సినేషన్ సిబ్బందికి అందజేసి నట్లు ఆయన తెలిపారు. మొదటి డోస్ తీసుకొనని వారికి అవగాహన కల్పించి వ్యాక్సిన్ ఇవ్వాలని అన్నారు. అనంతరం వ్యాక్సినేషన్ విషయమై ఇంటింటి సర్వే చేసి, వివరాలతో ఇంటి గడపలకు అంటించిన స్టిక్కర్లను కలెక్టర్ పరిశీలించారు. వ్యాక్సిన్ సురక్షితమని, వయోవద్ధులు, గర్భిణులు, బాలింతలు ఎటువంటి భయం లేకుండా తీసుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వం ప్రజలకు చేరువలో వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటుచేసి, ఉచితంగా అందిస్తుందని, ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఆర్థికస్వాలంభన పొందాలి
ప్రధానమంత్రి మైక్రో ఫుడ్ ప్రాసెస్సింగ్ ఎంటర్ ప్రైజెస్ పధకం ద్వారా స్వయం సహాయక సంఘ సభ్యులు లబ్దిపొంది, ఆర్థిక స్వావలంబన పొందాలని కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అన్నారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అధికారులతో జిల్లాలో పథక అమలుపై సమీక్ష నిర్వహించారు. మైక్రో ఫుడ్ ప్రాసెస్సింగ్ పధకంలో 327 మహిళా సంఘ సభ్యులను ఇప్పటికి నమోదు చేయడం జరిగిందన్నారు. ఈ 327 సంఘాల మహిళలకు 6 శాతం వడ్డీతో ఒక్కొక్కరికి రూ.40 వేల చొప్పున రుణం మంజూరు చేశామన్నారు. ఈ సంఘాల మహిళలు వారి వారి యూనిట్ అభివృద్ధికి వారి దరఖాస్తును, ప్రాజెక్టు రిపోర్ట్‌ను ఆన్లైన్లో నమోదు చేశామన్నారు. ఆసక్తి ఉన్నవారు 66 మంది మహిళలు 35శాతం సబ్సిడీ స్కీంలో నమోదయ్యారన్నారు. దరఖాస్తులు పరిశీలించి ఆమోదానికి చర్యలు చేపట్టామన్నారు. ఆయా కార్యక్రమాల్లో జనగామ ఆర్డీవో మధు మోహన్, జిల్లా వైద్య ఆరోగ్యాధికారి మహేందర్, తహసీల్దార్ రవీందర్, జనగామ మునిసిపల్ కమీషనర్ నర్సింహా, తదితరులు పాల్గొన్నారు. డిఆర్డీవో జి.రాంరెడ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్ టీఎస్. శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారిణి టి.రాధిక, జిల్లా ఉద్యానవన అధికారిణి జి.లత, జిఎం ఇండిస్టీస్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.