Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక నల్లచట్టాలను రద్దు చేయాలని ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ లో రైతులు శాంతియుత ఆందోళన చేపడుతుండగా కేంద్ర హౌం శాఖా సహయమంత్రి కాన్వారు ద్వారా రైతుల ప్రాణాలు కోల్పోయారని, తక్షణమే కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని సీపీఐ డిమాండ్ చేసింది. సోమవారం సీపీఐ పిలుపుమేరకు మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహాం ఎదుట మండల కార్యదర్శి కూరపాటి విజరు కుమార్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఇంత దారుణమైన సంఘటన చోటుచేసుకున్నప్పటికీ ప్రధాని మోడీ మౌనంగా ఉండటం దారుణమన్నారు. తక్షణమే కేంద్ర హౌంశాఖ సహాయ మంత్రిని బర్తరఫ్ చేసి రైతు కుటుంబాలకు న్యాయం చేయాలని కోరారు. ఇప్పటికైనా ప్రధాని తన మొండి పట్టు వీడి రైతులకు నష్టమైన నల్ల చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ చింత జగదీశ్, సీఐటీయూ మండల నాయకులు తోట రమేష్, రైతు సంఘం మండల నాయకుడు సాయిలు, వెంకటేష్, ప్రదీప్ పాల్గొన్నారు.