Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నెక్కొండ రూరల్
ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసిన ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు ధర్నా చేసిన ఘటన వరంగల్ జిల్లా నెక్కొండ మండలం పత్తిపాక తండాలో సోమ వారం చోటు చేసుకుంది. బాధితురాలి వివరాల ప్రకారం.. నెక్కొండ తండాకు చెందిన ఓడ అనూష, పత్తిపాక తండాకు చెందిన పురుషోత్తం కొనేండ్ల నుంచి ప్రేమించు కుంటున్నారు. ఇటీవల పెళ్లి చేసుకోవాలని యువతి నిల దీయండంతో యువకుడు ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో పరారయ్యాడు. ఈ క్రమంలో పెద్దమనుషుల పంచాయితీలో పెళ్లి చేసుకుం టానని పురుషోత్తం హామీ ఇచ్చాడు. అనంతరం నిశ్చితార్థం జరిగింది. ఈ క్రమంలో యువతిని గర్భవతిని చేసి పెండ్లి చేసుకోవాలంటే కట్నం తీసుకురావాలంటూ ఇంటి నుంచి పరారయ్యాడు. దీంతో న్యాయం చేయాలని బాధిత యువతి అనూష సోమవారం పురుషోత్తం ఇంటి ఎదుట ధర్నా నిర్వహించింది. పోలీసులు తనకు న్యాయం చేసే వరకూ పోరాటం చేస్తానని చెప్పింది. పరారైన పురుషోత్తం ఇతర వ్యక్తులతో తనకు ఫోన్ చేయించి ఇబ్బందులకు గురిచేస్తున్నాడని, తనకు న్యాయం జరిగేలా పోలీసులు చోరవ చూపాలని బాధితురాలు కోరింది. పోలీసులకు సోమవారం ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.