Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సానుకూలంగా స్పందించిన వీసీ
నవతెలంగాణ-హసన్‌పర్తి
కేయూ వీసీ నిర్లక్ష్యానికి నిరసనగా కేయూ ఎన్జీవో, నాలుగోతరగతి సంఘం ఉద్యోగుల ఆధ్వర్యంలో భోదనేతర ఉద్యోగులు వీసీ కార్యాల యంలో బైటాయీంచారు. గత ఆరు నెలలుగా అనేక సార్లు వినతి పత్రాలు సమర్పించి వీసీతో చర్చలు జరిపినప్పటికి సమస్యల మీద అధి కారులు స్పంధించక పోవడంతో తిరిగి ఈ నెల 5న 22 సమస్యలతో కూడిన వినతి పత్రన్ని రిజిస్ట్రార్‌కి అందజేశారు. ఇందుకు రిజిస్ట్రార్, వీస ీతో మాట్లాడి పరిష్కరించుకోవాలని చెప్పడంతో వీసీ అపాయింట్‌మెంట్‌కోసం పీఏ ద్వారా కోరడంతో రెండు సార్లు అపాయింట్మెంట్ ఇచ్చి తప్పించుకున్నట్లు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. సమయపాలన సాకుతో కాలం గడుపుతూ ఉద్యోగుల న్యాయమైన సమస్యల పరిష్కారానికి సమయం లేని వీసీ పాలన ఏమి చేస్తాడని ఉద్యోగ సంఘాల నాయకులు విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాల యాలు పీఆర్సీ అమలు చేస్తుంటే కేయూలో దాని ఉసేలేదని, పదోన్నతుల మాటేలేదని పొద్దునవస్తే సాయంత్రనికి సమయమే లేకుండా పోతుందన్నారు. అధికారులు ఎవరి కోసం పనిచేస్తున్నారు అన్నది అర్థంకాని ప్రశ్నగా మిగిలిపోయిందన్నారు. ఈ సందర్భంగా ఉప కులపతి ఆచార్య తాటికొండ రమేష్ స్పందించి అదనపు డ్యూటీ, కారుణ్య నియామకాలు, పదోన్నతులు లాంటి సమస్యలను 48 గంటల్లో పరిష్కారిస్తానని, ప్రధాన సమస్యయిన పీఆర్సీ ప్రభుత్వ ఉత్తర్వులను సాధ్యమైనంత తొందరలో అమలు చేస్తానని హామీ ఇవ్వడంతో ఉద్యోగులు శాంతించారు. ఈ కార్యక్రమములో కేయూ ఎన్జీఓ అధ్యక్ష, కార్యదర్శులు నాగబెల్లి ఎల్లయ్య, వల్లాల తిరుపతి, నాయకులు ఎ.సతీష్‌బాబు, తోట ప్రభాకర్, బూర నవీన్‌గౌడ్, బి.కష్ణవేణి, నాలుగోతరగతి అధ్యక్ష, కార్యదర్శులు మహ్మద్ అబ్దుల్, షుకూర్, చల్ల ప్రభాకర్, కోర్నెల్, బుచ్చయ్య, సాంబశివుడు, కాలేజీ సంఘం అధ్యక్షలు బోథ్రాజు, సుశీల్ పాల్గొన్నారు.