Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జీఎంపీఎస్ జిల్లా కార్యదర్శి లింగయ్య
నవతెలంగాణ-మట్టెవాడ
గొల్ల కురుమలందరికీ గొర్రెలను పంపిణీ చేసి, వారిని కోటీశ్వరులను చేస్తామని చెప్పిన కెేసీఆర్ ప్రభుత్వం గొర్రెల పంపిణీ చేయకుండా మోసం చేసిందని గొర్రెల, మేకల పెంపకందారుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కాడబోయిన లింగయ్య అన్నారు. జీఎంపీఎస్ జిల్లా కమిటీ సమావేశం సోమవారం నగరంలోని పశుసంవర్ధక శాఖ జేడీ కార్యాలయం వద్దగల డాక్టర్స్ బిల్డింగ్ లో సంఘం జిల్లా అధ్యక్షుడు శాతబోయిన రమేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం మాటలు నమ్మి గొర్రెలు వస్తాయనే ఆశతో ఇప్పటికే గొల్ల కురుమ లు రూ.లు31,520లు చొప్పున డీడీలు కట్టి మూడేండ్లు దాటుతున్నా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. ఇప్పుడు గొర్రెల యూనిట్ ధర పెరిగిందని, మరో 12,500/- రూపాయలు డీడీ కట్టాలని ప్రభుత్వం చెప్పడం దారుణమన్నారు. గతంలో నాగార్జున సాగర్, దుబ్బాక, ఇప్పుడు హుజరాబాద్లో జరుగుతున్న ఉప ఎన్నికల సందర్భంగా వాటిని ప్రభుత్వమే భరించి గొర్రెల పంపిణీ చేసిందని, అదేవిధంగా మిగతా జిల్లాల్లో గొర్రెల పంపిణీ చేయాలన్నారు. ప్రైమరీ సొసైటీ ఎన్నికల కోసం సహకార సంఘం సభ్యులందరూ గుర్తింపు కార్డులు తీసుకోవాలని చెబుతున్న అధికారులు వాటి ఖర్చును కూడా భరించాలన్నారు. హనుమకొండ జిల్లా పరిధిలోని గొల్ల కురుమలందరికీ గొర్రెల పంపిణీ జరగాలంటే జిల్లా పరిధిలోని ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలన్నాఉ. లేనియెడల ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు బండి పర్వతాలు, గంటి సమ్మయ్య, సతీష్, రాజ్ కుమార్, బండారి నారాయణ, నల్లబెట్ట చిన్న రాజు, బోయిని రాజు, పిడుగు యాకయ్య, నాయిని శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.