Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
ఉల్లిగడ్డ బాంబుల్లా పేలుతుండడంతో జనం బెంబేలెత్తుతున్నారు. బతుకమ్మ, దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో ఉల్లి ధరలు గణనీయంగా పెరుగు తున్నాయి. ఉల్లి ధరలను నియంత్రించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఓవైపు పెట్రోల్, డీజిల్ ధరలు రూ.100ను దాటడం, మరోవైపు భారీ వర్షాలు, తుఫాను నేపథ్యంలో ఉల్లి ధరలు, కూరగాయల ధరలు పెరుగుతుండడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురౌతున్నారు. వరంగల్ మార్కెట్‌కు రోజు 9, 10 లారీల ఉల్లి రావాల్సి ఉండగా ప్రస్తుతం కేవలం 3, 4 లారీలు మాత్రమే వస్తోంది. మహారాష్ట్రలో ఉల్లి నారు దశలో వర్షాలు కురవకపోవడంతో పంటలు దెబ్బతిన్నాయి. కర్నాటక, ఆంధ్రప్రదేశ్‌ల్లోనూ తుఫాను, భారీ వర్షాలతో ఉల్లి పంట దెబ్బతింది. తుఫాను, భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం 'నాఫెడ్' ద్వారా సమకూర్చిన ఉల్లి నిల్వలు చెడిపోయాయి. ఈ క్రమంలో మార్కెట్లో ఉల్లి కొరత ఏర్పడి ధరలు పతాకస్థాయికి చేరుకున్నాయి. నిత్యావసర సరుకుల ధరలు నవంబర్ వరకు పెరిగే అవకాశాలున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. సోలాపూర్, పూణె నుంచి కొత్త ఉల్లి వరంగల్ మార్కెట్‌కు చేరితే ధరలు తగ్గుతాయని తెలుస్తోంది.
ఉల్లి ప్రజలతో కన్నీరు పెట్టిస్తోంది. వారం రోజులుగా మార్కెట్లో భారీగా ధరలు పెరిగాయి. అక్టోబర్ మొదటి వారంలో కిలో ఉల్లి రూ.25లు ధర ఉండగా ప్రస్తుతం రూ.40-45లకు పెరిగింది. దేశంలో ఉత్పత్తయ్యే ఉల్లిగడ్డలో 35 శాతం మహారాష్ట్ర నుంచే వస్తోంది. ఖరీఫ్ సీజన్లో ఉల్లి ఉత్పత్తి అయ్యి సెప్టెంబర్, నవంబర్ మాసాల్లో మార్కెట్‌కు చేరుతుంది. ఖరీఫ్ ఉల్లి ఉత్పత్తిలో 75 శాతం ఉత్పత్తి మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచే వస్తోంది. ఏటా ఉల్లి మూడు దశల్లో సాగు చేస్తారు. ఖరీఫ్, ఖరీఫ్ చివర్లో, రబీలో ఉల్లిని సాగు చేస్తారు.
దెబ్బతిన్న బఫర్ స్టాక్
ఏటా నాఫెడ్ రైతుల నుంచి ఉల్లిని కొనుగోలు చేసి ప్రజల కోసం గోదాముల్లో నిల్వ చేస్తుంది. తుఫాను, భారీ వర్షాల నేపథ్యంలో తేమ శాతం గణనీయంగా పెరిగి గోదాముల్లో ఉన్న ఉల్లి దెబ్బతింది. దీంతో మార్కెట్లో ఉల్లి కొరత తీవ్రంగా పెరిగింది.
వరంగల్‌కు 8-10 లారీల ఉల్లి అవసరం..
వరంగల్ మార్కెట్‌కు రోజూ 8-10 లారీల ఉల్లి అవసరం. ప్రస్తుతం కేవలం 3-4 లారీలు మాత్రమే వస్తున్నాయి. ఒక్కో లారీలో 20 టన్నుల ఉల్లి వస్తుంది. అంటే ప్రతిరోజూ 180-200 టన్నుల ఉల్లి వరంగల్ మార్కెట్‌కు వస్తుంది. ప్రస్తుతం 80 టన్నుల ఉల్లి మాత్రమే వస్తుండడంతో వరంగల్ మార్కెట్లో ఉల్లి కొరత తీవ్రమైంది.
గణనీయంగా పెరిగిన ధరలు
వరంగల్ మార్కెట్లో సెప్టెంబర్ నెలాఖరు వరకు కిలో ఉల్లి రూ.25లు ధర ఉండగా అక్టోబర్ మొదటి వారం నుంచి ఉల్లి ధరలు గణనీయంగా పెరిగి తాజాగా రూ.40-45లకు పెరిగింది. ఏపీలోని కర్నూలు నుంచి వచ్చే ఉల్లి ఉత్పత్తులు తగ్గిపోయాయి. కర్నూలు ఉల్లి గడ్డలు చాలా చిన్నగా సైజులో ఉండే క్రమంలో రూ.25లకు కిలో అమ్ముతు న్నారు. కర్నూలు సరుకు అయిపోవడం తో రావడం లేదు. మహారాష్ట్ర సోలా పూర్, నాసిక్, పూణె నుంచి కొత్త ఉల్లి వస్తేనే మార్కెట్లో ధరలు తగ్గే అవకాశా లున్నాయని వరం గల్ సాయి గణేశ్ ట్రేడర్స్ అధినేత ఎన్కతి రాంబాబు 'నవతెలంగాణ'కు తెలి పారు. కొత్తఉల్లి అక్టోబర్ చివర్లో లేదా నవంబర్ మొదటి వారంలో వస్తుందని తెలిపారు.
కర్నాటక ఉల్లి మహారాష్ట్రకు..
మహారాష్ట్రలో ఉల్లి పంట గణ నీయంగా దెబ్బ తినడంతో కర్నాటక నుంచి నేరుగా అక్కడి రైతులు ఆ రాష్ట్రంలోని మార్కెట్లకే తరలి స్తున్నారు. దీంతో వరంగల్‌లోని మార్కెట్‌కు కర్నాటక ఉల్లి రావడం లేదు. దీంతో మార్కెట్లో తీవ్రంగా ఉల్లి కొరత ఏర్పడింది.