Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గోవిందరావుపేట
యువత క్రీడల్లో ప్రావీణ్యం పెంచుకోవాలని యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు చింత క్రాంతి కోరారు. మండలంలోని ఇప్పలగడ్డలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత, ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆదేశాల మేరకు క్రాంతి గురువారం వాలీబాల్ క్రీడాకారులకు సద్దుల బతుకమ్మ, దసరా పండగను పురస్కరించుకొని వాలీబాల్ కిట్లు అందించారు. యువత వాలీబాల్లో రాణించాలని సూచించారు. యువత సన్మార్గంలో నడవాలని కోరారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల నాయకులు కోరం రామ్మోహన్, ప్రవీణ్, మున్న, లింగయ్య, సుధీర్, నాగయ్య, తదితరులు పాల్గొన్నారు.