Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దంతాలపల్లి
మండలంలోని వేములపల్లి గ్రామానికి చెందిన రైతు నూకల దయాకర్‌రెడ్డి మండల కేంద్రంలోని ఓ ఫర్టిలైజర్ షాపులో కొనుగోలు చేసిన కలుపు మందును వరి పంటకు పిచికారీ చేయగా 8 ఎకరాల వరి పొలంలో నష్టం వాటిల్లింది. ఈ సందర్భంగా సదరు రైతుల విలేకరుల ఎదుట గురువారం గోడు వెళ్లబోసుకున్నారు. సుమారు రూ.3 లక్షల పెట్టుబడి పెట్టి ఆరుగాలం కష్టం చేసి తీరా పంట చేతికొస్తుందని ఆశించగా నకిలీ కలుపు మందు ప్రభావంతో పంట మొత్తం నష్టం జరిగిందని వాపోయాడు. ఫర్టిలైజర్ షాప్ యజమాని ఇచ్చిన ఆదామా కంపనీ కలుపు మందుతో వరి వాడిపోయిందని, సంబంధిత అధికారులు పరిశీలించి నష్టం పరిహారం అందించాలని కోరారు.