Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంగపేట
మండలంలోని వాగొడ్దుగూడెం, కన్నాయిగూడెం, లక్ష్మీనర్సాపురం, నిమ్మగూడెం గ్రామాలకు చెందిన గిరిజన రైతులు, మహిళలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి గురువారం పాలాభిషేకం నిర్వహించారు. మాజీ ఎంపీపీ, నాగులమ్మ ఆలయ ట్రస్టీ బాడిశ రామకష్ణ ఆధ్వర్యంలో సుమారు 200 మంది గిరిజన రైతులు, మహిళలు లక్ష్మీనర్సాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మాట్లాడారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పొడు భూములకు పట్టాలిస్తామని ప్రకటించడంతోపాటు ఈ నెలాఖరు నాటికి పోడు రైతుల నుంచి దరఖాస్తులు తీసుకుంటామని ప్రకటించడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కుడుముల లక్ష్మీనారాయణ, సొసైటీ చైర్మెన్ తోట రమేష్, మాజీ సర్పంచ్ కొమరం ఈశ్వరమ్మ, సోయం సీతయ్య, గుండేటి రాజు యాదవ్, అధికార ప్రతినిధి కటికనేని సత్యనారాయణ, సొసైటీ డైరెక్టర్లు నర్రా శ్రీధర్, అచ్చ సత్యనారాయణ, చిట్టిమల్ల రజిత సమ్మయ్య, మలికంటి శంకర్, పోలిన హరిబాబు, బాడిశ నాగరమేష్, ఈసం శ్రీను, పండ శ్రీను, ఉండవల్లి రమేష్, గంధం కిషోర్, సోషల్ మీడియా ఇన్ఛార్జి గుడివాడ శ్రీహరి పాల్గొన్నారు