Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిన్నగూడూరు
ప్రభుత్వ ఆస్పత్రిలోనే మెరుగైన వైద్యం అందుతుందని ఉగ్గంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి రవికుమార్ తెలిపారు. మండలంలోని విస్సంపల్లి గ్రామానికి చెందిన పులిగుజ్జి సౌమ్య ఆడశిశువుకు జన్మనివ్వగా ఆమెకు ప్రభుత్వం అందించిన 16 వస్తువులతో కూడిన కేసీఆర్ కిట్‌ను గురువారం అందించారు. కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ జయశ్రీ, స్టాఫ్ నర్స్ మాధవి, ఏఎన్ఎం ఎస్తేర్ రాణి, ఆశవర్కర్ సైదమ్మ, జ్యోతి పాల్గొన్నారు