Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు/మహబూబాబాద్
ములుగు, మహబూబాబాద్ జిల్లాల్లో సద్దుల బతుకమ్మ పండుగ గురువారం వేడుకగా నిర్వహించారు. మహిళలు తెల్లవారుజాము నుంచే బతుకమ్మలను పలు రకాల పూలతో అలంకరించారు. ఈ సందర్భంగా పల్లోల్లోనూ, పట్టణాల్లోనూ మహిళలు బతుకమ్మలతో చెరువుల వద్ద నిమజ్జనానికి వేడుకగా వెళ్లడంతో సందడి నెలకొంది. పలు చోట్ల ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సర్పంచ్‌లు బతుకమ్మల నిమజ్జనానికి తరలివచ్చి ఉత్సాహం నింపారు. సద్దుల బతుకమ్మ వేడుకలకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఏర్పాట్లు చేశారు పోలీసు అధికారులు బందోబస్తు నిర్వహించగా పంచాయతీ, ఇతర శాఖల అధికారులు విద్యుత్ లైట్లు, ఇతర సదుపాయాలు కల్పించారు.
ములుగు :జిల్లావ్యాప్తంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత, ఎమ్మెల్యే సీతక్క డీసీసీ అధ్యక్షుడు నల్లెల కుమారస్వామి నివాసంలో పూలతో బతుకమ్మని పేర్చి తోపుకుంట కట్టకు తీసుకెళ్లారు. కట్టపై బతుకమ్మ ఆటపాటలతో ఉత్సాహపర్చారు. అలాగే ములుగు ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి సుధీర్, ఇతర మహిళా ప్రజాప్రతినిధులు బతుకమ్మ సంబరాల్లో పాలుపంచుకున్నారు. ప్రజలు తెలంగాణ సంప్రదాయాన్ని కాపాడాలని ఎమ్మెల్యే సీతక్క ఆకాంక్షించారు.
తొర్రూరు : మండలంలోని వెలికట్టెలో సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. గ్రామ శివారులోని చెరువులో మహిళలు బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అనుబంధ బీసీ సెల్ మండల అధ్యక్షుడు ధీకొండ శ్రీనివాస్ మాట్లాడారు. బతుకమ్మ వేడుకలు ప్రజల్లో సమైకత, పరస్పర సహకారం, మానసిక విలువలు, వికాసాన్ని పెంచుతాయని తెలిపారు.
గూడూరు : మండలంలోని అన్ని గ్రామాల్లో సద్దుల బతుకమ్మ ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని పాకాల వాగు సమీపంలో బతుకమ్మలతో మహిళలు భారీ ఎత్తున పోటెత్తారు. మండలంలోని బోల్లపల్లి గ్రామంలో ఎంపీపీ బానోత్ సుజాత మోతీలాల్ బతుకమ్మ పండుగలో పాల్గొని సందడి చేశారు. అన్ని గ్రామాల్లోనూ మహిళలు బతుకమ్మలతో కోలాటాలు, సంప్రదాయ పాటలు పాడుతూ ఆకట్టుకున్నారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సీఐ రాజిరెడ్డి, ఎస్సై సతీష్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఆయా గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు సద్దుల బతుకమ్మ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు.
బోల్లపల్లిలో బతుకమ్మ విగ్రహ ఆవిష్కరణ
మండలంలోని బోల్లపల్లి గ్రామానికి చెందిన చల్ల రాంరెడ్డి స్మారకంగా అతడి కొడుకులు క్లాస్-1 కాంట్రాక్టర్, పీఏసీఎస్ చైర్మెన్ లింగారెడ్డి, ప్రముఖ వ్యాపారవేత్త శ్రీనివాస్‌రెడ్డి సొంత ఖర్చులతో ఏర్పాటు భూమిని విరాళంగా అందజేయగా ఆ స్థలంలో గ్రా మపంచాయతీ ఆధ్వర్యంలో బతుకమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేసి బతుకమ్మ ఘాట్‌గా తీర్చిదిద్దారు. ఘాట్‌ను, బతుకమ్మ విగ్రహాన్ని లింగారెడ్డి, ఎంపీపీ బానోత్ సుజాత మోతీలాల్, సర్పంచ్ లావుడ్య సునీత సురేష్ ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలోని బతుకమ్మతో వచ్చిన మహిళలతో ప్రాంగణం కిక్కిరిసింది.కురవి : మండల కేంద్రంలోని గుడి సెంటర్లోని తెలంగాణ తల్లి, పెద్ద చెరువు వద్ద బతుకమ్మ తల్లి విగ్రహాలను డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఆవిష్కరించి మాట్లాడారు. గౌరమ్మ తల్లి ప్రతిరూపమే బతుకమ్మ అని చెప్పారు. పలు రకాల పూలతో బతుకమ్మను పేర్చి మహిళలు 10 రోజులు ఆటపాటలతో నిర్వహించి తదనంతరం నిమ్మజనం చేస్తారని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ పద్మ నర్సింహారావు, ఎంపీపీ గుగులోతు పద్మావతి రవినాయక్, టీఆర్ఎస్ నాయకుడు బజ్జూరి పిచ్చిరెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు తోట లాలయ్య, సర్పంచ్ల ఫోరమ్ మండల అధ్యక్షుడు ఎర్రంరెడ్డి సుధాకర్‌రెడ్డి, ఆలయ చైర్మెన్ బాదావత్ రామునాయక్, సొసైటీ చైర్మెన్ దొడ్డ గోవర్ధన్‌రెడ్డి, మాజీ ఆలయ కమిటీ చైర్మెన్ రాజునాయక్, మాజీ ఎంపీపీ రామచంద్రయ్య, ఉపసర్పంచ్ భరత్, సభ్యులు నూతక్కి నర్సింహారావు, సాంబశివరావు, ఇరుగు వెంకన్న, మూకరి వెంకన్న, రాగం వీరభద్రం, తదితరులు పాల్గొన్నారు.
మంగపేట : సద్దుల బతుకమ్మను మండల ప్రజలు గురువారం సంబురంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే యువతులు తీరొక్క పూలను సేకరించి తలంటు స్నానం ఆచరించి బతుకమ్మలను పేర్చారు. సద్దల బతుకమ్మ సందర్భంగా మండలంలో గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు బతుకమ్మ ఆడే ప్రాంతాల్లో విద్యుత్ దీపాలు, ఇతర ఏర్పాట్లు చేశారు. మండల కేంద్రంలోని ఉమాచంద్రశేఖరస్వామి, గౌరారం వాగు ప్రాంతాల్లో పంచాయతీ అధికారులు విద్యుత్ లైట్లు ఏర్పాటు చేశారు. అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఎస్సై తహెర్ బాబా ఆధ్వర్యంలో నాలుగు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి మంగపేట, కమలాపురం, మల్లూరు, రాజుపేట, తదితర ప్రాంతాల్లో బందోబస్తు ఏర్పాటు చేశారు. మరో ఐదు సివిల్ బందాలను ఏర్పాటు చేసి దొంగతనాల నిరోధానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మహిళలు బంగారు ఆభరణాల దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
దంతాలపల్లి : మండలంలోని పెద్దముప్పారంలో బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్, జిల్లా వైస్ చైర్మెన్ వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
బయ్యారం : మండలంలో బతుకమ్మ వేడుకల్లో ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొనగా ఎస్సై జగదీష్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.
మరిపెడ : మండలంలో సద్దుల బతుకమ్మ పండుగకు ముఖ్యఅతిథిగా మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత పాల్గొని ఆడిపాడారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ గుడిపూడి నవీన్‌రావు, మున్సిపల్ చైర్పర్సన్ సింధూర కుమారి రవినాయక్, ఎంపీపీ గుగులోతు అరుణ రాంబాబు నాయక్, జెడ్పీటీసీ తేజావత్ శారద రవీందర్, మాజీ ఎంపీపీ వెంకన్న, మహేందర్‌రెడ్డి, ఉప్పల నాగేశ్వర్రావు, తదితరులు పాల్గొన్నారు